Homeజిల్లాలునిజామాబాద్​Bhulaxmi Temple | భూలక్ష్మి ఆలయంలో ఘనంగా నవరాత్రి వేడుకలు

Bhulaxmi Temple | భూలక్ష్మి ఆలయంలో ఘనంగా నవరాత్రి వేడుకలు

అక్షరటుడే, ఇందూరు: Bhulaxmi Temple | జిల్లా వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు సోమవారం అమ్మవారు సరస్వతి దేవి (Saraswathi Devi) రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ సందర్భంగా నగరంలోని ముబారక్​నగర్​లో (Mubharak nagar) ఉన్న భూలక్ష్మి మాత ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకుడు కళ్యాణ్​ శర్మ ఆధ్వర్యంలో సరస్వతి రూపంలో అమ్మవారికి పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. నవరాత్రుల సందర్భంగా ఆలయంలో అమ్మవారికి నిత్యం ఆయా రూపాల్లో అలంకరణలు చేస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నామన్నారు. కుంకుమార్చనలు, అభిషేకాలు జరిపిస్తున్నామని తెలిపారు. కాగా.. ఆలయానికి భక్తులు నిత్యం పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Must Read
Related News