అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ponnam Prabhakar | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by-election) బీసీ వర్గాలకు చెందిన నవీన్ యాదవ్‌ను గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా కొండాపూర్ మినర్వా కన్వెన్షన్ హాల్లో కాపు సోదరుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
మంత్రి పొన్నం (Minister Ponnam) మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు చెందిన యువకుడు, చదువుకున్న నవీన్ యాదవ్‌ను (Naveen Yadav) గెలిపించుకోవాలన్నారు. కాపు, మున్నూరు కాపు వేరు వేరు కాన్నారు. నవీన్ యాదవ్ గెలుపు కోసం కాపులంతా ఐక్యంగా కష్టపడాలని సూచించారు.
Ponnam Prabhakar |కాపులకు అవకాశాలు కల్పిస్తాం
స్థానిక సంస్థల ఎన్నికలు (local body elections), మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాపు వర్గానికి అవకాశాలు కల్పిస్తామన్నారు. అయితే ఇంట్లో కూర్చుంటే ఎవరికి పదవులు రావని ఆయన స్పష్టం చేశారు. కష్టపడిన వారికి ఫలితం ఉంటుందన్నారు. కాపు సోదరులకు ఏ సమస్య ఉన్నా సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకట్ స్వామి (Minister Vivek Venkat Swamy), కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు, శ్యామ్ మోహన్, గాలి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Ponnam Prabhakar | జోరు పెంచిన పార్టీలు
జూబ్లీహిల్స్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలో ప్రచారంలో జోరు పెంచాయి. కాంగ్రెస్ అభ్యర్థి తరఫున మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ (BRS) సైతం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తోంది. తమ అభ్యర్థిని గెలిపించాలని కోరుతోంది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి మద్దతుగా ఆ పార్టీ నేతలు బస్తీల్లో తిరుగుతున్నారు. కాగా జూబ్లీహిల్స్ బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నారు. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా.. 14న కౌంటింగ్ నిర్వహించనున్నారు.
