అక్షరటుడే, ఇందూరు: దేశ నిర్మాణ శిల్పి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) కొనియాడారు. ఏక్ భారత్ ఆత్మనిర్బార్ భారత్ కార్యక్రమంలో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం యూనిటీ మార్చ్ నిర్వహించారు.
జిల్లా కేంద్రంలోని వర్ని చౌరస్తాలో గల పటేల్ విగ్రహం నుంచి ఆర్ఆర్ చౌరస్తా, పులాంగ్ చౌరస్తా మీదుగా పాత కలెక్టరేట్ మైదానం (old Collectorate ground) వరకు రన్ కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వాతంత్ర్య పోరాటంలోనే కాకుండా భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మహానుభావుడు పటేల్ అన్నారు. దేశ వ్యాప్తంగా 562 సంస్థానాలను ఒక తాటిపైకి తెచ్చి దేశాన్ని ఏకీకృతంగా నిర్మించడం సాహసమేనన్నారు.
సమాజంలో ఐక్యత, సమానత్వం, శాంతి, సోదర భావం పెంపొందించడంలో ప్రతి ఒక్కరి పాత్ర విలువైనది అన్నారు. ఇందూరు అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కృషి ఎంతో ఉందన్నారు. అందరి సహకారంతో తాను అర్బన్ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మేరా భారత్ కో ఆర్డినేటర్ శైలి బెల్లాల్, జిల్లా యువజన క్రీడల అధికారి పవన్ కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
