HomeజాతీయంCPI Narayana | పార్టీ కీలక బాధ్యతల నుంచి తప్పుకున్న నారాయణ

CPI Narayana | పార్టీ కీలక బాధ్యతల నుంచి తప్పుకున్న నారాయణ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CPI Narayana | పార్టీ కీలక బాధ్యతల నుంచి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) తప్పుకున్నారు. తనకు 75 ఏళ్లు నిండటంతో పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటించారు.

పార్టీలో 75 ఏళ్లు నిండిన వారు రిలీవ్ కావాలని గతంలో నిర్ణయించారు. ఈ మేరకు తాను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. ఇకపై పార్టీ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్‌గా ఆయన కొనసాగున్నారు. ఆయన మాట్లాడుతూ.. చండీగఢ్‌(Chandigarh)లో జరిగిన 25వ మహాసభలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా 75 ఏళ్లు నిండిన వాళ్లు రిలీవ్ కావాలని నిర్ణయించామన్నారు. దీంతోనే తాను తప్పుకున్నట్లు తెలిపారు. పార్టీలో అంతర్గత సమస్యల పరిష్కారం కోసం తాను పని చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనికోసం కంట్రోల్ కమిషన్ ఉందని వెల్లడించారు. పార్టీ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్‌(Party Control Commission Chairman)గా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఆయన తెలిపారు. కాగా కమిషన్​లో ఛైర్మన్​, సెక్రెటరీతో సహా మొత్తం 9 మంది సభ్యులు ఉంటారు.

Must Read
Related News