67
అక్షరటుడే, కామారెడ్డి : Narala Ratnakar | కాంగ్రెస్ పార్టీ (Congress Party) రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత రత్నాకర్ హైదరాబాద్‌లో (Hyderabad) మర్యాదపూర్వకంగా కలిశారు. మీనాక్షి నటరాజన్ కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌తో కలిసి రత్నాకర్ శుక్రవారం ఆమెను కలిశారు. ఈ సందర్భంగా జిల్లా, రాష్ట్ర రాజకీయాలపై చర్చ జరిగిందని రత్నాకర్ పేర్కొన్నారు. ఆమెతో (Meenakshi Natarajan) పలు విషయాలు చర్చించడం ఆనందంగా ఉందన్నారు.