అక్షరటుడే, వెబ్‌డెస్క్:Balakrishna | నందమూరి బాలకృష్ణ ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) చేతుల మీదుగా పద్మభూషణ్ padma bhushan అవార్డుని అందుకున్న విషయం మనందరికి తెలిసిందే. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా బాలయ్య 50 ఏళ్ల నుంచి సేవలందిస్తూ ఇప్పుడు రాజకీయాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి(Basavatarakam Cancer Hospital) ద్వారా ఉచిత వైద్యం అందిస్తున్నారు. బాలయ్య సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ని అందించింది. బాలయ్య ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడంతో హిందూపురంలో అభిమానులు సన్మాన సభని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బాలయ్య ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Balakrishna | ఫుల్ జోష్‌తో..
పద్మభూషణ్ అవార్డు(Padma Bhushan Award) అందుకోవడానికి ఇంతకంటే మంచి సమయం ఇంకేముంటుంది అని బాలయ్య Bala Krishna అన్నారు. మొదట నాన్నగారు ఆ తర్వాత అన్నయ్య హరికృష్ణ గారు హిందూపురంకి ఎమ్మెల్యేగా పనిచేశారు. వాళ్ల తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే అదృష్టం నాకు దక్కింది అని అన్నారు.. ఎమ్మెల్యే(MLA)గా గెలిస్తే సరిపోదు.. ప్రజలకు అవసరమైన పనులు చేస్తూ వచ్చాను. అందుకే మూడోసారి గెలవగలిగాను. 50 సంవత్సరాలుగా హీరోగా నటించిన నటుడు ప్రపంచంలో ఎవడూ లేడు. చాలామంది హీరోలు మధ్యలో క్యారక్టర్ ఆర్టిస్టులుగా దారి మళ్ళడం జరుగుతుంది. కానీ 50 ఏళ్లు హీరోగా నిలబడటానికి నాకు అంతగా శక్తినిచ్చిన తెలుగుజాతికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అని బాలయ్య(Balayya) అన్నారు.
బాలకృష్ణ గురించి చాలా రకాలుగా మాట్లాడుకుంటుంటారు. ‘ఏం చూసుకుని.. బాలకృష్ణకు అంత పొగరు’ అని అంటుంటారు. నన్ను చూసుకునే నాకు పొగరు అని నేను అంటాను. నా మాట సూటిగా ఉంటుంది.. నా బాట ముక్కుసూటిగా ఉంటుంది” అని బాలకృష్ణ పేర్కొన్నారు. నా నిజ జీవితంలో సంఘటనలకు సినిమాల్లో నేను చేసే పాత్రలకు ఎంతో సారూప్యం ఉంటుంది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్, ‘శ్రీరామరాజ్యం’(Sri Rama Rajyam)లో రాముడిగా నటించడం.. ఇలా ప్రతిదీ నాకు కలిసొచ్చింది. నాన్న శతజయంతి జరపుకోవడం, మూడోసారి నేను ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం, బసవతారకం హాస్పిటల్ చైర్మన్ గా 15వ సంవత్సరంలో అడుగుపెట్టడం.. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ నాలుగు వరుస హిట్లు అందుకోవడం.. హీరోగా 50 ఏళ్లు పూర్తికావడం.. ఈ తరుణంలో పద్మభూషణ్ రావడం బాగుంది. ఇకపై నా సినిమాలతో నేనేంటో చూపిస్తా. మీ అంచనాలకు కూడా అందని సినిమాలు చేస్తా అంటూ బాలయ్య ఫ్యాన్స్ Fansని ఉత్తేజపరిచారు.