అక్షరటుడే, ఆర్మూర్: Typing Test | పట్టణానికి చెందిన పవార్ కృప నక్షత్ర ఇటీవల జరిగిన టైప్ రైటింగ్ ఇంగ్లిష్ హయ్యర్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంక్ సాధించింది. ఆర్మూర్‌లోని సంత్ జ్ఞానేశ్వర్ టైప్ రైటింగ్ ఇనిస్టిట్యూట్‌లో ఆమె శిక్షణ తీసుకుంది.
హైదరాబాద్‌లోని నారాయణగూడలో..
ఈ సందర్భంగా సంత్ జ్ఞానేశ్వర్ టైప్ రైటింగ్ ఇనిస్టిట్యూట్ (Type writing Institute) ప్రిన్సిపల్ దొండి రవివర్మ మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో తమ విద్యార్థి మూడో ర్యాంక్ సాధించిందన్నారు. ఈ మేరకు హైదరాబాద్ (Hyderabad) నారాయణ గూడలో జరిగిన తెలంగాణ టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ అండ్ కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్ రావు (MLC Balmoor Venkat Rao) జ్ఞాపికలు అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టైప్ రైటింగ్ అండ్ కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ అసోసియేషన్ రాష్ట్రబాధ్యులు, విద్యార్థులు, వారి తల్లి తండ్రులు పాల్గొన్నారు.