అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nagababu | మెగా బ్రదర్ కొణిదెల నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ప్రకటించి నేటికి ఒక సంవత్సరం పూర్తయినా ఆ హామీ ఇప్పటికీ అమలులోకి రాలేదు.
2024 డిసెంబర్ 9న ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో అధికారిక లెటర్‌హెడ్‌పై నాగబాబుకు మంత్రి పదవి కేటాయిస్తామని చంద్రబాబు వెల్లడించారు. కానీ ఇప్పటికీ ఆ నిర్ణయం ప్రకటించిన దశలోనే నిలిచిపోయింది.అప్పట్లో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకటి టీడీపీ,ఒకటి బీజేపీ,ఒకటి జనసేనకు దక్కుతాయని ప్రచారం జరిగింది. జనసేన (Janasena) వైపు నుండి నాగబాబు పేరే ఖరారైనట్టు పార్టీ వర్గాలు చెప్పారు.
Nagababu | పవన్ అడ్డుపడతున్నాడా?
అయితే అనూహ్యంగా టీడీపీ అభ్యర్థుల జాబితాలో సాన సతీష్ ఎంట్రీ కావడంతో సమీకరణం మారిపోయింది. టీడీపీ రెండు స్థానాలు తీసుకోవడంతో జనసేనకు కేటాయించే అవకాశమే లేకుండా పోయింది. 2019 నుండి 2024 వరకూ జనసేనలో నాగబాబు కీలక పాత్ర పోషించారు.2019లో నరసాపురం MP పోటీలో ఓడినా పార్టీ కోసం చురుకుగా పనిచేశారు.2024 లో మళ్లీ నరసాపురం (Narasapuram) ఆశించినా కూటమి కోసం త్యాగం చేయాల్సి వచ్చింది.అనకాపల్లి నుండి పోటీ చేయాలనుకున్నా బీజేపీ కోసం వదలాల్సి వచ్చింది. MLA పోటీ కూడా కుదరలేదు.చివరకు రాజ్యసభ అవకాశం కూడా దక్కలేదు.
ఈ వరుస ‘త్యాగాలతో ఆయన అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ అసంతృప్తిని తగ్గించడానికే చంద్రబాబు మంత్రి పదవికు లిఖితపూర్వక హామీ ఇచ్చారని అప్పట్లో వ్యాఖ్యానించారు. కానీ ఏడాది గడిచినా హామీ అమలు కాలేదు. ప్రస్తుతం ఏపీ మంత్రిమండలిలో ఒక్క ఖాళీ ఉంది.అది నాగబాబుకు ఇవ్వాలని చంద్రబాబు భావించినా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాత్రం పునరాలోచనలో పడినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం జనసేనలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్. ఇందులో పవన్, దుర్గేష్ ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. నాగబాబు కూడా అదే వర్గం. అలా అయితే జనసేన వద్ద ఉన్న 4 మంత్రి పోస్టుల్లో 3 ఒకే కులానికి చెందినవారికి వెళ్తాయి.దీనివల్ల పార్టీపై ‘కులపక్షపాతం’ ముద్ర పడుతుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. త్వరలో ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఆ సందర్భంలో నాగబాబుకు మంత్రి పదవి దక్కుతుందా? లేదా చూడాలి.