HomeసినిమాSamantha | నేడే సమంత రెండో వివాహం.. ఆ పోస్ట్‌తో సోషల్ మీడియాలో హీటెక్కిన చ‌ర్చ‌

Samantha | నేడే సమంత రెండో వివాహం.. ఆ పోస్ట్‌తో సోషల్ మీడియాలో హీటెక్కిన చ‌ర్చ‌

నాగ చైత‌న్య‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న స‌మంత ఆయ‌న నుండి విడిపోయిన త‌ర్వాత నుండి సింగిల్‌గా ఉంటుంది. అయితే కొన్నాళ్లుగా రాజ్‌తో ఎక్కువ‌గా కలిసి తిరుగుతుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Samantha | టాలీవుడ్ ప్రముఖ నటి సమంత రెండో వివాహం చేసుకోబోతుందన్న వార్తలు ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ప్రముఖ దర్శకుడు, ‘ది ఫ్యామిలీ మాన్’ ఫేమ్ రాజ్ నిడిమోరుతో ఆమె పెళ్లి కోయంబత్తూరు (Coimbatore)లోని ఈషా యోగా సెంటర్‌లో జరిగే అవకాశముందంటూ అనేక పోస్టులు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

అయితే ఇప్పటి వరకు సమంతగానీ, రాజ్ నిడిమోరు (Raj Nidimoru) గానీ ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.అయితే ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామలి దేవి చేసిన ఒక వ్యాఖ్య. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో“తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారు” అని రాసింది. ఈ వ్యాఖ్యను నెటిజన్లు రాజ్–సమంత పెళ్లి వార్తలతో జతచేసి చూడడంతో రూమర్లు మరింత పెరిగాయి.

Samantha | ఇది నిజ‌మా?

సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం, డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో సమంత–రాజ్ నిడిమోరుల వివాహం  జరగనుందట. సమంత గతంలో కూడా అనేకసార్లు ఆధ్యాత్మిక కారణాల కోసం ఈషా సెంటర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు పెళ్లి కూడా అక్క‌డే చేసుకోనుంద‌ని స‌మాచారం.గ‌త కొద్ది రోజులుగా స‌మంత‌-రాజ్ రిలేష‌న్ గురించి నెట్టింట అనేక ప్ర‌చారాలు సాగుతున్నా దీనిపై వారిరివురు ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌డం లేదు. ‘ఫ్యామిలీ మాన్ 2’ తో మొదలైన పరిచయం ఆ త‌ర్వాత ప్రేమ‌గా మారింద‌ని టాక్.

సమంత–రాజ్ నిడిమోరుల ట్రాక్ రికార్డు చూస్తే.. The Family Man 2 లో సమంత న‌టించ‌గా, దీనికి రాజ్–DK ద్వయం ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దీని త‌ర్వాత Citadel: Honey Bunny ప్రాజెక్ట్‌లో కూడా రాజ్–DK మళ్లీ సమంతని తీసుకున్నారు. ఈ క్ర‌మంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం గురించి అప్పటి నుంచే ప్రచారం వస్తూనే ఉంది. ఈ రూమర్లు వేగంగా వ్యాపిస్తున్నా… ఇంకా ఇరు పక్షాల నుంచి ఏ అధికారిక స్టేట్‌మెంట్ రావడం లేదు.అందుకే ఈ వార్తలు నిజమా? కేవలం ప్రచారమా? అన్నదానిపై ఇంకా స్పష్టత కావాలి. అయితే రాజ్ మాజీ భార్య చేసిన పోస్ట్‌ మాత్రం సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. నెటిజన్లు, అభిమానులు సమంత నుండి ఏదైనా క్లారిటీ వచ్చే వరకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సమంత రెండో పెళ్లి వార్తే సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ టాపిక్ గా మారింది.

Must Read
Related News