Homeఆంధప్రదేశ్Konaseema | బాలిక మృతి కేసులో వీడిన మిస్టరీ..

Konaseema | బాలిక మృతి కేసులో వీడిన మిస్టరీ..

కోనసీమ జిల్లాలో ఇటీవల సంచలనం సృష్టించిన బాలిక మృతి కేసును పోలీసులు ఛేదించారు. శ్రీను అనే వ్యక్తి హత్య చేసినట్లు గుర్తించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Konaseema | అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా (Ambedkar Konaseema district) రామ‌చంద్ర‌పురంలో ప‌దేళ్ల చిన్నారి సిర్రా రంజిత‌ మృతి కేసులో మిస్టరీ వీడింది. ఐదు రోజుల క్రితం రంజిత అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిని పోలీసులు గుర్తించారు.

రామ‌చంద్ర‌పురం ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో (Ramachandrapuram government hospital) సిర్రా సునీత స్టాప్‌న‌ర్స్‌గా ప‌ని చేస్తోంది. ఆమె భర్త ముంబైలో (Mumbai) జాబ్​ చేస్తున్నాడు. ఆమె ఉద్యోగ రీత్తా టి.న‌గ‌ర్ క‌మ‌ల్ కాంప్లెక్స్‌లో అద్దెకు ఉంటోంది. ఆమె చిన్న కుమార్తె రంజిత ఐదో తరగతి చదువుతోంది. మంగళవారం పాఠశాల నుంచి వచ్చిన ఆమె సాయంత్రం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే చిన్నారి మృతిపై ఆమె తల్లి అనుమానం వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో శ్రీను అనే వ్యక్తి హత్య చేసినట్లు గుర్తించారు.

Konaseema | ఫ్యాన్​ రిపేర్​ పేరుతో..

పోస్టుమార్టం, ఫోరెన్సిక్ రిపోర్టు (forensic report) ఆధారంగా రంజితను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీను అనే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడినట్లు తేల్చారు. బాలిక కుటుంబం ఉంటున్న భవనంలో శ్రీను స్నేహితుడు షాప్​ నిర్వహిస్తున్నాడు. దీంతో తరుచు ఆ షాప్​కు శ్రీను వచ్చేవాడు. ఈ క్రమంలో రంజిత కుటుంబంతోనూ పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో మంగళవారం ఫ్యాన్​ రిపేర్​ పేరుతో ఇంట్లోకి వెళ్లి రంజితను హత్య చేశాడు. అనంతరం తనపై అనుమానం రాకుండా విచారణకు వచ్చిన పోలీసులతో సైతం తిరిగాడు. నిందితులను త్వరగా పట్టుకోవాలని లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో మెసెజ్​లు కూడా పెట్టాడు. అయితే హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Must Read
Related News