MLA Dhanpal | నియోజకవర్గ అభివృద్దే లక్ష్యం: ఎమ్మెల్యే ధన్​పాల్

అక్షరటుడే, ఇందూరు: MLA Dhanpal | నియోజకవర్గ అభివృద్ధికి శాయాశక్తులా కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని శ్రీనగర్​ కాలనీలోని 45 డివిజన్​లో మున్సిపల్​ కమిషనర్​ దిలీప్​కుమార్​తో (Municipal Commissioner Dilip Kumar) కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగరంలోని డివిజన్​లోని బాల హనుమాన్​ మందిరం (Bala Hanuman Mandir) పక్కన ఉన్న అండర్​ బ్రిడ్జి పాడైపోయినందున కొత్త వంతెన కోసం డీపీఆర్​ […]

అక్షరటుడే, ఇందూరు: MLA Dhanpal | నియోజకవర్గ అభివృద్ధికి శాయాశక్తులా కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని శ్రీనగర్​ కాలనీలోని 45 డివిజన్​లో మున్సిపల్​ కమిషనర్​ దిలీప్​కుమార్​తో (Municipal Commissioner Dilip Kumar) కలిసి పర్యటించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగరంలోని డివిజన్​లోని బాల హనుమాన్​ మందిరం (Bala Hanuman Mandir) పక్కన ఉన్న అండర్​ బ్రిడ్జి పాడైపోయినందున కొత్త వంతెన కోసం డీపీఆర్​ తయారు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. త్వరలోనే కొత్త వంతెన నిర్మిస్తామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు.

డ్రెయినేజీ సమస్యలు తలెత్తకుండా మున్సిపల్​ సిబ్బంది నిత్యం శుభ్రం చేయాలని ఆదేశించారు. అవసరమున్న చోట డ్రెయినేజీల పునర్నిర్మాణం చేయాలని సూచించారు. రాష్ట్రంలో నిజామాబాద్​ కార్పొరేషన్​ను (Nizamabad Corporation) పారిశుధ్యంలో మొదటిస్థానంలో నిలబెట్టే దిశగా ప్రతి అధికారి, సిబ్బంది చిత్తశుద్ధితో పని చేయాలని ఆయన సూచించారు. నగరంలోని వీధిదీపాల కొరత తీవ్రంగా ఉందని.. వీలైనంత త్వరగా స్ట్రీట్​లైట్ల ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు.

కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు కనీస మౌలిక సౌకర్యాలైన బీటీ, సీసీ రోడ్లు, డ్రెయిన్లు, ఓపెన్ జీమ్ (open gym), పార్కుల అభివృద్ధి, కల్వర్టుల నిర్మాణానికి స్పెషల్ ఫండ్ కింద రూ. 100 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ధన్​పాల్​ తెలిపారు. అనంతరం కాలనీవాసులు మాట్లాడుతూ.. రాత్రి సమయంలో ఆకతాయిలు 45వ డివిజన్​లో మద్యం సేవించి న్యూసెన్స్ చేస్తున్నారని వివరించగా.. కట్టికి చర్యలు తీసుకునేలా ఏసీపీతో మాట్లాడతానని చెప్పారు. కార్యక్రంలో మున్సిపల్ ఏఈ పావని, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, స్థానిక నాయకులు ఆకుల శ్రీనివాస్, నరేశ్​, బొబ్బిలి వేణు, ఎర్రన్న, బీజేపీ నాయకులు పవన్, ఆనంద్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...