SP Rajesh Chandra | స్టేట్​లెవల్​ పోలీస్​ డ్యూటీ​మీట్​లోనూ ప్రతిభ చూపాలి

అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | జిల్లా నుంచి జోనల్​ పోలీస్​ డ్యూటీ మీట్​లో (Zonal Police Duty Meet) పాల్గొన్న పోలీసులు రాష్ట్ర జోనల్​మీట్​లోనూ ప్రతిభ చూపాలని ఎస్పీ రాజేష్​ చంద్ర (SP Rajesh Chandra) పేర్కొన్నారు. పోలీస్​డ్యూటీ మీట్​లో జిల్లాపోలీసులు 11 పథకాలు సాధించిన సందర్భంగా శనివారం వారిని ఎస్పీ కార్యాలయంలో అభినందించారు. SP Rajesh Chandra | పథకాలు సాధించిన వీరే.. ఈనెల 7, 8 తేదీల్లో కరీంనగర్​లో (Karimnagar) జరిగిన […]

అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | జిల్లా నుంచి జోనల్​ పోలీస్​ డ్యూటీ మీట్​లో (Zonal Police Duty Meet) పాల్గొన్న పోలీసులు రాష్ట్ర జోనల్​మీట్​లోనూ ప్రతిభ చూపాలని ఎస్పీ రాజేష్​ చంద్ర (SP Rajesh Chandra) పేర్కొన్నారు. పోలీస్​డ్యూటీ మీట్​లో జిల్లాపోలీసులు 11 పథకాలు సాధించిన సందర్భంగా శనివారం వారిని ఎస్పీ కార్యాలయంలో అభినందించారు.

SP Rajesh Chandra | పథకాలు సాధించిన వీరే..

ఈనెల 7, 8 తేదీల్లో కరీంనగర్​లో (Karimnagar) జరిగిన 2వ జోనల్ పోలీస్ డ్యూటీ మీట్​లో జిల్లా తరపున ఆరుగురు పోలీస్ అధికారులు 11 పతకాలు సాధించారు. గాంధారి ఎస్సై ఆంజనేయులు (Gandhari SI Anjaneyulu) 5 పతకాలు సాధించారు. అందులో (3 బంగారు, 2 వెండి పతకాలు) ఉన్నాయి. లిఫ్టింగ్(Lifting), ప్యాకింగ్, ఫింగర్ ప్రింట్స్ ఫార్వర్డ్, నేర స్థల ఫోటోగ్రఫీ (Crime scene photography) విభాగాల్లో బంగారు పతకాలు, విచారణలో శాస్త్రీయ వినియోగం (ఫింగర్ ప్రింట్ మరియు ఫోరెన్సిక్ సైన్స్) విభాగంలో వెండి పతకాలు సాధించారు.

మద్నూర్ ఎస్సై విజయ్ ఫోరెన్సిక్, ఫోటోగ్రఫీ, ఫింగర్ ప్రింట్ సైన్స్ విభాగంలో రెండు వెండి పతకాలనుసాధించారు. బిచ్కుంద కానిస్టేబుల్​ లక్ష్మీనారాయణ దర్యాప్తు (రాత పరీక్ష), పోలీస్ పోర్ట్రెట్ విభాగంలో కాంస్య పతకం సాధించారు. రాజంపేట కానిస్టేబుల్​ చిరంజీవి కంప్యూటర్ అవగాహన విభాగంలో కాంస్య పతకం సాధించారు. ఏఆర్ విభాగానికి చెందిన రామచంద్రం, ఎల్లారెడ్డిలు విధ్వంసకాల విచ్చిన్నంపై తనిఖీ విభాగంలో ఒక్కో వెండి పతకం సాధించారు.

SP Rajesh Chandra | సిబ్బందిలో వృత్తి నైపుణ్యం మెరుగు

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ అధికారులు, సిబ్బంది వృత్తి నైపుణ్యాన్ని మెరుగు పర్చుకోవడానికి పోలీస్ డ్యూటీ మీట్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వృత్తి నైపుణ్యం ఉన్న వారిని గుర్తించడానికి పోలీస్ డ్యూటీ మీట్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. జోనల్ స్థాయిలో పతకాలు సాధించిన వారికి రాష్ట్ర స్థాయిలో, ఆ తర్వాత జాతీయ స్థాయిలో పోలీస్ డ్యూటీ మీట్ ఉంటుందని అందులో సైతం ప్రతిభ కనబర్చి జిల్లాకు మెడల్స్ సాధించాలని సూచించారు. కార్యక్రమంలో సాయుధ దళ ఇన్​స్పెక్టర్​ సంతోష్ కుమార్, నవీన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...