అక్షరటుడే, వెబ్‌డెస్క్: Musk shocks Trump : అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రపంచ కుబేరుడు, డోజ్ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) షాక్ ఇచ్చారు.
ఓ బిల్లు విషయంలో మనస్తాపానికి గురైన ఆయన డోజ్ పదవి Doge positionకి రాజీనామా చేశారు. ట్రంప్, మస్క్ మధ్య చెడిందని కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారానికి తెర దించుతూ.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) Department of Government Efficiency (Doge) పదవీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్టు బుధవారం ఎక్స్ వేదికగా ప్రకటించారు.
వాస్తవానికి మస్క్ పదవి మే 30తో ముగియనుండగా, ఆయన ముందుగానే తప్పుకున్నారు. ఎలాన్ మస్క్ ట్రంప్ పరిపాలనా వర్గం నుంచి వైదొలగుతున్నారనే విషయాన్ని వైట్ హౌస్ అధికార ప్రతినిధి కూడా ధ్రువీకరించారు. డోజ్ అధిపతిగా ఎలాన్ మస్క్ పదవీకాలం మే 30తో ముగియనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వాన్ని పునర్నిర్మించడానికి DOGE ప్రయత్నాలు కొనసాగుతాయని ట్రంప్ పాలక వర్గ ప్రతినిధి తెలిపారు.
Musk shocks Trump : ప్రభుత్వానికి ఆక్సిజన్‌లా డోజ్
డోజ్ చీఫ్‌గా తనకు అవకాశం కల్పించినందుకు ట్రంప్‌నకు మస్క్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే అమెరికా ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా తన షెడ్యూల్ ముగిసిందని ప్రకటించారు. ప్రభుత్వంలో వృథా ఖర్చును తగ్గించే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. డోజ్ మిషన్ కాలక్రమేణా మరింతగా బలోపేతం అవుతుందని, ఇది రాబోయే రోజుల్లో.. ప్రభుత్వానికి ఆక్సిజన్‌లా పనిచేస్తుందని, ఒక జీవన విధానంలా మారుతుందని అభిప్రాయపడ్డారు.
Musk shocks Trump : ఎన్నికల్లో ట్రంప్‌నకు అండగా..
అమెరికా అధ్యక్ష ఎన్నికల (US presidential election) సందర్భంగా మస్క్ ట్రంప్ వెంట నడిచారు. ఆయన విజయం కోసం ఆర్థికంగా సహా అన్ని విధాలుగా సహాయం చేశారు. దీంతో గతేడాది జరిగిన ఎన్నికల్లో ట్రంప్ బైడెన్‌ను ఓడించారు. తనకు చేసిన సహాయానికి కృతజ్ఞతగా ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన వెంటనే మస్క్‌కు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వంలో వృథా ఖర్చును తగ్గించాలనే లక్ష్యంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(డోజ్) అధిపతిగా నియమించారు.
కాగా, పలు విషయాల్లో ట్రంప్ వెంట నడిచిన మస్క్.. పన్నుల బిల్లు విషయంలో అసంతృప్తికి గురయ్యారు. ట్రంప్ తీసుకురానున్న కొత్త బిల్లుపై మస్క్ కొన్ని రోజుల క్రితం బాహాటంగానే వ్యతిరేకత తెలిపారు. ఈ బిల్లు తీసుకొస్తే ప్రభుత్వంలో అనవసర ఖర్చులు తగ్గించేందుకు ఇన్నాళ్లు డోజ్ పడ్డ కష్టం వృథా అవుతుందని, అధిక బడ్జెట్ కేటాయించాల్సి రావడం వల్ల ద్రవ్యలోటు కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య చెడిందనే ఊహాగానాలు వస్తున్న తరుణంలో మస్క్ తన డోజ్ పదవికి గుడ్ బై చెప్పేశారు.
అధ్యక్షుడు ట్రంప్(President Trump) శాసనసభ ఎజెండాలోని కేంద్ర భాగాన్ని విమర్శించిన ఒక రోజు తర్వాత మస్క్ నిష్క్రమణ జరిగింది. అధ్యక్షుడు తన “పెద్ద అందమైన బిల్లు” అని పిలిచే దానితో తాను నిరాశ చెందానని మస్క్ అన్నారు. ఈ చట్టాన్ని “భారీ వ్యయ బిల్లు”గా అభివర్ణించారు.
Musk shocks Trump : బిల్లును సమర్థించుకున్న ట్రంప్
మరోవైపు. తాను తీసుకురానున్న బిల్లును ట్రంప్ సమర్థించుకున్నారు బుధవారం ఓవల్ కార్యాలయంలో ఆయన.. చట్టాన్ని చర్చించడంలో ఉన్న సున్నితమైన రాజకీయాల గురించి తన ఎజెండాను సమర్థించుకున్నారు. “దానిలోని కొన్ని అంశాల గురించి నేను సంతోషంగా లేను, కానీ దానిలోని ఇతర అంశాల పట్ల నేను సంతోషంగా ఉన్నాను” అని చెప్పారు. మరిన్ని మార్పులు చేయవచ్చని కూడా ట్రంప్ సూచించారు. “ఏమి జరుగుతుందో మనం చూడబోతున్నాం. దీనికి ఒక మార్గం ఉంది” అని హింట్ ఇచ్చారు.