అక్షరటుడే, ముప్కాల్: Kabaddi Association | ముప్కాల్ మండల కబడ్డీ అసోసియేషన్ (Mupkal Mandal Kabaddi Association) నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ కబడ్డీ సంఘం (Telangana Kabaddi Association) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కబడ్డీ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో జీఎన్ఆర్ గార్డెన్స్‌లో ముప్కాల్ కబడ్డీ అసోసియేషన్ సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Kabaddi Association | నూతన కార్యవర్గం ఇదే..
ముప్కాల్ కబడ్డీ అసోసియేషన్ ఛైర్మన్‌గా మోతే గంగారెడ్డి, అధ్యక్షుడిగా ఏలేటి గంగాధర్ (విజయ్), ప్రధాన కార్యదర్శిగా ముస్కు శ్రీనివాస్, కోశాధికారి గాండ్ల చిన్న బాలరాజ్, ఉపాధ్యక్షులుగా గద్దల గంగారాం, ఏలేటి రాములు, సహ కార్యదర్శులుగా గొర్రె మోహన్, లోక సుభాష్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా బద్దం హన్మాండ్లు, బుర్కల సాయిలు, కార్యవర్గ సభ్యులుగా ఏలేటి మల్లారెడ్డి, ఇలియాస్, బద్దం అశోక్ రెడ్డి, ముస్కు చిన్న నర్సయ్య, కంచు నరేష్ తదితరులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ముస్కు మోహన్, దేవరాజు, సుంకరి ప్రదీప్, గంగారాజు, వై.గంగాధర్, హరీష్, మహేష్, చారి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.