అక్షరటుడే, ఇందూరు: NMC | నగరంలోని అహ్మదీబజార్లో మున్సిపల్ అధికారులు (Municipal officials) శనివారం తనిఖీలు నిర్వహించారు. కాలనీలోని బేకరీలను అధికారులు ఉదయాన్నే పరిశీలించారు. అపరిశుభ్రంగా ఉన్న పలు బేకరీలకు (bakeries) జరిమానాలు విధించారు.
పదార్థాలు తయారు చేసే ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని అధికారులు, నిర్వాహకులకు సూచించారు. పరిశుభ్రత పాటించని పలు బేకరీలకు రూ.5వేలు వరకు జరిమానా విధించారు. కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ సూపర్వైజర్ సాజిద్అలీ, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మహిపాల్, జవాన్లు తదితరులు పాల్గొన్నారు.
