అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Municipal elections | మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా శనివారం అధికారులు వార్డుల వారీగా రిజర్వేషన్లు (Ward-wise Reservations) ఖరారు చేశారు.
రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికల (Municipal elections) నగరా మోగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం తుది ఓటరు జాబితా విడుదల చేసింది. పోలింగ్ కేంద్రాల లిస్ట్ సైతం ప్రకటించింది. ఇటీవల మున్సిపాలిటీల వారీగా రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించగా.. తాజాగా వార్డుల వారీగా అధికారులు ఖరారు చేశారు. శనివారం ఉదయం నిజామాబాద్ కలెక్టరేట్లో (Nizamabad Collectorate) లక్కీ డ్రా ద్వారా వార్డుల రిజర్వేషన్లను ప్రకటించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఖరారైన రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి.
Municipal elections | నిజామాబాద్ కార్పొరేషన్లో..
నిజామాబాద్ (Nizamabad) కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. ఇందులో ఎస్సీ జనరల్‌కు 2, 40, 44, ఎస్సీ మహిళకు 17, 39 డివిజన్లను రిజర్వ్ చేశారు. ఎస్టీ జనరల్‌కు 13, బీసీ జనరల్‌కు 7, 14, 15, 28, 38, 42, 43, 46, 48, 51, 52, 58, బీసీ మహిళకు 12, 16, 20, 22, 23, 37, 41, 45, 56, 57, 59, 60 డివిజన్లు కేటాయించారు. జనరల్‌కు 1, 4, 5, 8, 10, 18, 19, 25, 26, 30, 35, 47, 50, 55, జనరల్ మహిళకు 3, 6, 9, 11, 21, 24, 27, 29, 31, 32, 33, 34, 36, 49, 53, 54 డివిజన్లను కేటాయించినట్లు సమాచారం.
Municipal elections | ఆర్మూర్‌లో..
ఆర్మూర్ మున్సిపాలిటీలో (Armoor Municipality) మొత్తం 36 వార్డులు ఉన్నాయి. ఇందులో ఎస్టీ జనరల్‌కు రెండో వార్డు కేటాయించారు. ఎస్సీ మహిళకు 8, ఎస్సీ జనరల్‌కు 4వ వార్డును రిజర్వ్ చేశారు. బీసీ మహిళకు 01, 06, 17, 20, 22, 27, 28, బీసీ జనరల్‌కు 07, 10, 14, 18, 23, 24, 25 వార్డులు కేటాయించారు. జనరల్ మహిళకు 03, 05, 12, 15, 16, 19, 21, 29, 33, 36, జనరల్‌కు 09, 11, 13, 26, 30, 31, 32, 34, 35 వార్డులను రిజర్వ్ చేసినట్లు తెలిసింది.
Municipal elections | భీమ్‌గల్‌లో..
భీమ్‌గల్ (Bheemgal) మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. ఎస్సీ మహిళకు రెండో వార్డు, ఎస్సీ జనరల్‌కు 8, ఎస్టీ జనరల్ 11, బీసీ జనరల్‌కు 7, 9, బీసీ మహిళకు 12 వార్డు కేటాయించారు. జనరల్‌కు 1, 3, జనరల్ మహిళకు 4, 5, 6, 10 వార్డులు ఖరారైనట్లు సమాచారం.
Municipal elections | బోధన్‌లో..
బోధన్ (Bodhan) బల్దియాలో మొత్తం 38 వార్డులు ఉన్నాయి. అందులో ఎస్సీ మహిళకు 10, ఎస్సీ జనరల్ 13, 16 వార్డులు రిజర్వ్ అయ్యాయి. ఎస్టీ జనరల్ 24, బీసీ మహిళకు 4, 7, 8, 14, 19, 23, 35, బీసీ జనరల్‌కు 2, 5, 6, 9, 12, 22, 26, 34 వార్డు స్థానాలను కేటాయించారు. జనరల్ మహిళ 1, 3, 11, 20, 28, 29, 31, 32, 33, 36, 38, జనరల్‌కు 15, 17, 18, 21, 25, 27, 30, 37 వార్డులు ఖరారు చేసినట్లు తెలిసింది.