అక్షరటుడే, ఇందూరు: Municipal Reservations | మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో వేగం పుంజుకుంది. ఇటీవల ఓటరు తుది జాబితాతో పాటు పోలింగ్ కేంద్రాల జాబితాను అధికారులు విడుదల చేశారు. అలాగే బుధవారం రాత్రి రిజర్వేషన్లను సైతం ఎన్నికల కమిషన్ (Election Commission) ఖరారు చేసింది. మున్సిపాలిటీలతో పాటు నగరపాలక సంస్థలో (Municipal Corporation) ఏ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు రిజర్వ్ అవుతాయనే విషయం స్పష్టమైంది.
Municipal Reservations | 60 డివిజన్లు..
నిజామాబాద్ నగరపాలక సంస్థలో మొత్తం 60 డివిజన్ల ఉండగా.. బీసీ మహిళ 12.. జనరల్ 12, ఎస్టీకి ఒకే ఒక్క సీటు కేటాయించారు. ఎస్సీ మహిళ 2, జనరల్ 3, అన్ రిజర్వ్డ్ 14, జనరల్ మహిళకు 16 సీట్లను కేటాయించారు.
Municipal Reservations | ఆర్మూర్ మున్సిపాలిటీలో..
ఆర్మూర్ మున్సిపాలిటీలో(Armoor Municipality) మొత్తం 36 వార్డులు ఉండగా అన్ రిజర్వ్డ్ 8, జనరల్ మహిళ 10, బీసీ మహిళ 7, బీసీ జనరల్ 7, ఎస్సీ జనరల్ 1, ఎస్సీ మహిళ 1, ఎస్టీకి ఒక సీటు కేటాయించారు.
Municipal Reservations | బోధన్ మున్సిపాలిటీలో..
బోధన్ మున్సిపాలిటీలో(Bodhan Municipality) మొత్తం 38 వార్డులు ఉన్నాయి. ఇందులో ఎస్టీ జనరల్ 1, ఎస్సీ జనరల్ 2, మహిళ 1, బీసీ జనరల్ 8, మహిళలకు ఏడు, అండ్ రిజర్వ్డ్ 8, జనరల్ మహిళకు 11 సీట్ల కేటాయించారు.
Municipal Reservations | భీమ్గల్ మున్సిపాలిటీలో..
భీమ్గల్ మున్సిపాలిటీలో (Bheemgal Municipality) మొత్తం 12 వార్డులు ఉన్నాయి. ఇందులో ఎస్టీ జనరల్ 1, ఎస్సీ జనరల్ 1, మహిళ 1, బీసీ జనరల్ 2, మహిళ 1, అన్ రిజర్వ్డ్ 2, జనరల్ మహిళకు 4 వార్డులు కేటాయించారు.