అక్షరటుడే, హైదరాబాద్: Multilevel parking facility | గ్రేటర్ హైదరాబాద్‌లో పార్కింగ్ కష్టాలను గట్టెక్కించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఈ మేరకు నమూనాగా కేబీఆర్ పార్క్ KBR Park వద్ద మల్టీలెవెల్ పార్కింగ్ ఫెసిలిటీ అయిన ఆటోమేటెడ్ స్మార్ట్ రోటరీ పార్కింగ్ automated smart rotary parking ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ ఆటోమేటెడ్ స్మార్ట్ రోటరీ పార్కింగ్‌ను నేడు (శనివారం, నవంబరు 29) ప్రారంభించనున్నారు. ఈ పార్కింగ్ సిస్టమ్‌ను జీహెచ్ఎంసీ GHMC అధ్వర్యంలో నవ నిర్మాణ్ అసోసియేట్స్ తీర్చిదిద్దింది.
ఈ మేరకు దీని ట్రయల్ రన్‌ను ఇప్పటికే నిర్వహించారు. ఈ పార్కింగ్ సిస్టమ్ సక్సెస్ అయితే జీహెచ్ఎంసీ పరిధిలోని పలు చోట్ల దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు.
Multilevel parking facility | 72 కార్లు ఒకేసారి..
కేబీఆర్ పార్కు వద్ద ఏర్పాటు చేసిన మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థలో ఒకేసారి 72 కార్లను పార్కు చేయొచ్చు. ఇక్కడ పార్క్ చేసేందుకు ముందే బుక్ చేసుకోవాలి. పార్కింగ్, నావిగేషన్, ఇతర సేవల కోసం మొబైల్ యాప్‌ను కూడా తీసుకురాబోతున్నారు.
రొటేషన్ మెషిన్ ద్వారా ఇది వర్క్ చేస్తుంది. అరలు అరలుగా ఈ వ్యవస్థ ఉంటుంది. ట్రే లాంటి స్టాండ్‌పైకి కారును తీసుకెళ్లి నిలపగానే.. అది పైకి వెళ్లి అరల్లాంటి గదుల్లో కారును నిలుపుతుంది. దీనివల్ల పార్కింగ్ స్థలం ఆదా అవుతుంది.
