అక్షరటుడే, ఆర్మూర్: Aloor | ఆలూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఆలూర్ మండలాధ్యక్షుడు ముక్కెర విజయ్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు.
ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి (Vinay Kumar Reddy) ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్పంచ్ అభ్యర్థి ముక్కెర విజయ్ ఆధ్వర్యంలో గ్రామంలోని ఖండెల మల్లన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు, గ్రామస్థులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
