HomeసినిమాMrunal Takhur | డేటింగ్ వార్త‌ల‌తో హాట్ టాపిక్‌గా మారిన మృణాట్ ఠాకూర్.. చీర క‌ట్టులో...

Mrunal Takhur | డేటింగ్ వార్త‌ల‌తో హాట్ టాపిక్‌గా మారిన మృణాట్ ఠాకూర్.. చీర క‌ట్టులో అదుర్స్

అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ త‌న క్యూట్ లుక్స్‌తో క‌ట్టిప‌డేస్తూ ఉంటుంది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అందాల ముద్దుగుమ్మ చీర‌క‌ట్టులో మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mrunal Takhur | స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు. తాజాగా ఆమె చేసిన కొత్త ఫొటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)లో భారీగా వైరల్ అవుతోంది. ట్రెండ్ అవుతున్న ఈ సూపర్ స్టైలిష్ ఫోటోలు ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఇటీవలి కాలంలో మృణాల్ సినిమాలకంటే తన వ్యక్తిగత జీవితంతోనే మీడియా హైలైట్‌లో నిలుస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ (Star Hero Dhanush)తో ప్రేమలో ఉన్నారన్న రూమర్స్ తెగ చక్కర్లు కొట్టాయి. ఆ వార్తలపై స్పష్టత రాకముందే, మృణాల్ గురించి మరో గాసిప్ సంచలనం రేపింది. టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Ayyar)తో మృణాల్ ప్రేమాయణంలో ఉన్నారన్న వార్తలు వైరల్ అవడంతో సినీ వర్గాలు, అభిమానులు ఉలిక్కిపడ్డారు.

Mrunal Takhur | చీర‌క‌ట్టులో అదుర్స్..

కొంతకాలంగా వీరిద్దరూ కలిసి కనిపిస్తున్నారంటూ, పెళ్లి వార్తలు కూడా త్వరలోనే బయటపడవచ్చని కథనాలు వచ్చాయి. ఆస్ట్రేలియా టూర్‌లో గాయపడి విశ్రాంతి తీసుకుంటున్న శ్రేయస్ Shreyas ayyer – మృణాల్‌తో ఎప్పుడు ప్రేమాయణం కొన‌సాగించాడు, అస‌లు వారిద్ద‌రి లవ్ స్టోరీ ఎప్పుడు మొదలైందోన‌ని నెటిజన్లు ప్రశ్నలు వేసుకుంటున్నారు. ఈ వరుస రూమర్స్‌పై ఇటీవ‌ల మృణాల్ ఠాకూర్ స్పందించారు. తనపై వస్తున్న గాసిప్స్ గురించి మాట్లాడుతూ, ఇలాంటి పుకార్లు వినడమే హాస్యాస్పదంగా ఉంటుంది. ఇవన్నీ నాకు ఉచితంగా వచ్చే పీఆర్ స్టంట్స్ లాంటివే” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తన తల్లితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

ఇక సినిమాల విషయానికి వస్తే… మృణాల్ ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అడివి శేష్ నటిస్తున్న ‘డెకాయిట్’ సినిమాలో హీరోయిన్‌గా కనిపించనున్నారు. అలాగే అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న AA22 మూవీలో కూడా మృణాల్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు టాలీవుడ్‌లో జోరుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని సమాచారం. ఇవి కాకుండా మరిన్ని ప్రాజెక్టులు కూడా చర్చల్లో ఉన్నాయి. మృణాల్‌కి ఒక‌టి రెండు హిట్స్ ప‌డితే, ఆమె రేంజ్ మ‌రో స్థాయికి చేర‌డం గ్యారెంటీ. అయితే మృణాట్ అప్పుడ‌ప్పుడు చీర క‌ట్టులో క‌నిపిస్తూ అల‌రిస్తుంటుంది. తాజాగా ఈ అమ్మ‌డు చీర క‌ట్టులో దిగిన ఫొటోలు షేర్ చేస్తూ అభిమానుల‌ని మంత్ర ముగ్ధుల‌ని చేసింది. ప్ర‌స్తుతం ఈ పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Must Read
Related News