అక్షరటుడే, కామారెడ్డి: Body Builders Competition | కామారెడ్డి పట్టణంలో మిస్టర్ కామారెడ్డి బాడీ బిల్డర్స్ కాంపిటీషన్ను (Body Builders Competition) నవంబర్ 16న నిర్వహించనున్నట్లు మదీన్ మానియా, పవర్ హౌస్ జిమ్ ప్రతినిధులు నవీన్, యాసిన్ తెలిపారు. పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిమ్ యజమానులంతా (gym owners) కలిసి చాలా సంవత్సరాల తర్వాత కామారెడ్డిలో జిల్లాస్థాయి బాడీ బిల్డర్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో 7 కేటగిరీలు ఉంటాయని, 50-55, 55-60, 60-65, 65-70, 70-75,75-80, 80-85 కేటగిరీలలో పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఉంటాయని తెలిపారు.
పోటీల్లో పాల్గొనే వారికి 500 రిజిస్ట్రేషన్ ఛార్జీలు నిర్ణయించడం జరిగిందని వివరించారు. ఆసక్తి ఉన్నవాళ్లు 9848278436 నంబరును సంప్రదించాలని సూచించారు. పోటీలు (competitions) ఎక్కడ నిర్వహించేది త్వరలో తెలియజేస్తామన్నారు. జిల్లాలోని బాడీ బిల్డర్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శివ, లిఖిత్ గౌడ్, మహిపాల్, రథీఫ్ రెడ్డి, తేజ, ఎజాజ్, దేవా పాల్గొన్నారు.