అక్షరటుడే, వెబ్డెస్క్: MP Arvind | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అటు కేసీఆర్, ఇటు సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి.
నిజామాబాద్లో నిర్వహించిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో ఆయన మాజీ ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రిపై (Chief Minister Revanth Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ (KCR) అంత నమ్మకద్రోహి తెలంగాణలోనే లేరని.. తెలంగాణ సమాజం నమ్మకాన్ని వమ్ము చేసిన వ్యక్తి అంటూ ధ్వజమెత్తారు. విద్య, వైద్యం, గ్రామ పరిపాలన వ్యవస్థను కేసీఆర్ కుటుంబం నాశనం చేసిందని.. కూలిపోయే డ్యామ్లు కట్టి ఇవాళ పెద్దాయన బయటకు వచ్చి సూక్తులు చెబుతున్నారంటూ విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే కేసీఆర్ కుటుంబాన్ని (KCR Family) జైలుకు పంపాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
MP Arvind | రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా ఎంపీ అర్వింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘రేవంత్ రెడ్డి మాట్లాడితే లాగులో తొండలు సొరగొడతా.. సొరగొడతా.. అంటున్నాడు. తొండలు ఎందుకు సొరగొట్టుడు.. నువ్వే సొర్రు.. దానికి నీకు పెద్ద తేడా ఏం లేదు.. నువ్వే సొర్రు.. వాళ్ల లాగులోకి, వీళ్ల లాగులోకి సొర్రడానికి ప్రజలు నిన్ను ముఖ్యమంత్రిని చేయలేదు.. ఆ కుటుంబాన్ని బొక్కలో వేయడానికి చేశారు.. కానీ వాళ్లను మాత్రం జైల్లో వేయడం లేదు’ అంటూ మండిపడ్డారు. అవినీతికి పాల్పడిన కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపాల్సిన సీఎం రేవంత్రెడ్డి ప్యాకేజీలకు అమ్ముడుపోవద్దని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డికి పౌరుషం ఉంటే.. కొడంగల్ పాలమూరు బిడ్డవయితే కేసీఆర్ కుటుంబాన్ని వెంటనే జైలుకు పంపాలన్నారు.
MP Arvind | రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశం
ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో వేదికగా పలు కామెంట్లు పెడుతున్నారు.