- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​MP Arvind | తీరు మార్చుకోకుంటే అధికారులపై చర్యలు: ఎంపీ అర్వింద్​ ఆగ్రహం..

MP Arvind | తీరు మార్చుకోకుంటే అధికారులపై చర్యలు: ఎంపీ అర్వింద్​ ఆగ్రహం..

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : MP Arvind | నిధులు మంజూరైనప్పటికీ పనులు నత్తనడకన సాగుతుండడపై ఎంపీ అర్వింద్​ అగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమీక్ష సమావేశాన్ని ఛైర్మన్​ అర్వింద్​ అధ్యక్షతన మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో (Collector Office) నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఎంపీ లాడ్స్​ కింద నిధులొచ్చిన పనుల్లో జాప్యంపై అధికారులను నిలదీశారు.

- Advertisement -

MP Arvind | జిల్లావ్యాప్తంగా..

జిల్లా వ్యాప్తంగా సగానికి పైగా పనులు పూర్తయినప్పటికీ ఆర్మూర్ డివిజన్​లోనే అధిక శాతం పనులు పెండింగ్​లో ఉండడంపై ఆర్మూర్​ పంచాయతీరాజ్ శాఖ అధికారి రాజేశ్వరిపై ఎంపీ (MP Arvind) మండిపడ్డారు. తన పనితీరు వెంటనే మార్చుకోకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంపీ లాడ్స్ కింద చేయిస్తున్న పనులకు స్పష్టంగా నేమ్​బోర్డ్స్​ ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా అధికారులను ఆదేశించారు.

వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్రం నుంచి మంజూరైన నిధులను సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు. మధ్యాహ్న భోజనం పథకంలో మూణ్నెళ్ల నుంచి సంబంధిత శాఖలకు నిధులు మంజూరు కాకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు.

MP Arvind | జిల్లా జనరల్​ ఆస్పత్రిలో..

జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి ఎంఆర్ఐ మిషన్ మంజూరైనప్పటికీ ఇంతవరకు ఇక్కడికి చేరుకోకపోవడంతో పేద ప్రజలు ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరిగాల్సి వస్తోందని కమిటీ సభ్యులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. ఆస్పత్రిలో ఎమ్మారై మిషన్ (MRI Mission) ఏర్పాటు చేసేలా అధికారులు చొరవ చూపాలని ఎంపీ సూచించారు.

MP Arvind | జాతీయ కుటుంబ ప్రయోజన పథకం..

జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద కుటుంబ సభ్యుల్లో మొదటి సంపాదనపరుడు ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం (Central Government) రూ.20 వేల ఆర్థికసాయం అందిస్తోందని ఎంపీ అర్వింద్​ అన్నారు. అర్హత ఉన్నవారు ఆన్​లైన్​ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకాన్ని ప్రజలందరికీ చేరువయ్యేలా అధికారులు పనిచేయాలని సూచించారు.

MP Arvind | అడ్డగోలుగా ట్యాక్స్​ వసూళ్లు..

నిజామాబాద్ కార్పొరేషన్ (Nizamabad Corporation) పరిధిలో అపార్ట్​మెంట్లు ఇతర వాటికి అధికారులు అడ్డగోలుగా పన్ను వసూలు చేస్తున్నారని దిశ కమిటీ సభ్యులు దృష్టికి తెచ్చారు. హైదరాబాద్​లో కూడా లేనంత ఇక్కడ టాక్స్ విధిస్తూ ప్రజలను వేధిస్తున్నారన్నారు. కొందరికి అయితే 10,000 టాక్స్ వేయాల్సి ఉండగా రూ.10 లక్షలు వేస్తున్నారని అలాగే రూ.లక్ష టాక్స్ కట్టాల్సిన వాళ్లకి రూ.వేలల్లో ట్యాక్స్ విధిస్తున్నారని మున్సిపల్ అధికారులపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

MP Arvind | శుభ్రతపై అధికారుల్లో సమన్వయలోపం..

అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ (Urban MLA Dhanpal) మాట్లాడుతూ నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని కెనాళ్ల క్లీనింగ్ విషయంలో అధికారుల మధ్య సమన్వయం కొరవడిందన్నారు. నాగారంలోని కెనాల్ క్లీనింగ్ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కబ్జాలకు గురవుతున్న చెరువులను కాపాడుతూ కెనాలను క్లీనింగ్ చేయాలని అధికారులను సూచించారు. సమీక్ష సమావేశంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఫారెస్ట్ అధికారి, అదనపు కలెక్టర్లు, నిజామాబాద్​ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News