అక్షరటుడే, కోటగిరి: Local Body Elections | గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల (Gram Panchayat election) ప్రచారం జోరందుకుంది. బరిలో నిలబడిన అభ్యర్థులు ఇంటింటికీ తిరగుతూ ప్రచారం చేస్తున్నారు. తమను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని హామీలు ఇస్తున్నారు.
Local Body Elections | హంగర్గ ఫారంలో వింత ప్రచారం..
పోతంగల్ మండలంలోని (Pothangal mandal) హంగర్గ ఫారంలో ఓ అభ్యర్థి తరపున కొడుకు ప్రచారం చర్చనీయాంశమైంది. ఎన్నికల అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హంగర్గ ఫారంలో సర్పంచ్ అభ్యర్థిగా (sarpanch candidate) రజియా బేగం నామినేషన్ వేశారు. ఈ మేరకు ఆమె ప్రచారం చేయాల్సి ఉండగా.. ఆమె కుమారుడు ఎండీ ఫిరోజ్ సొంతంగా తన ఫొటోతో పోస్టర్లు ప్రింట్ చేసుకుని ప్రచారం చేయడం మొదలు పెట్టారు. తల్లి ఫొటో కాకుండా తన ఫొటో పెట్టుకుని ప్రచారం చేస్తుండడంపై పలువురు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయగా స్పందించిన అధికారులు వెంటనే పోస్టర్లను తొలగింపజేసి అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సునీల్ తెలిపారు.
