- Advertisement -
More
    HomeUncategorized​​Uttar Pradesh | ప్రియుడితో హనీమూన్‌కు వెళ్లేందుకు ఇద్దరు పసి పిల్లలను చంపిన తల్లి

    ​​Uttar Pradesh | ప్రియుడితో హనీమూన్‌కు వెళ్లేందుకు ఇద్దరు పసి పిల్లలను చంపిన తల్లి

    - Advertisement -

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ​​Uttar Pradesh : ప్రియుడితో హనీమూన్‌(honeymoon)కు వెళ్లేందుకు ఇద్దరు పసి పిల్లలను చంపింది ఓ కసాయి తల్లి. ఉత్తరప్రదేశ్ లో ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్(​​Uttar Pradesh) లోని ముజఫర్ నగర్ ప్రాంతం రోడ్కాలి గ్రామానికి చెందిన ఓ మహిళ (24)కు అర్హాన్ (5), ఇనాయ(1) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

    తన భర్త వసీం జీవనోపాధి కోసం చండీగఢ్ (Chandigarh)లో ఉంటున్నాడు. ఈ క్రమంలో జునైద్ అనే వ్యక్తితో ముస్కాన్ అక్రమ సంబంధం పెట్టుకుంది. జునైద్‌తో కలిసి వెళ్లిపోవాలని నిర్ణయించుకొని, అడ్డుగా ఉన్న తన పిల్లలకు విషమిచ్చి కడతేర్చింది. పోలీసుల విచారణలో నిందితురాలు నేరం అంగీకరించింది.

    కట్టుకున్న దానిని నమ్మి.. ఆమె కోసం, తన ఇద్దరు పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఊరు కాని ఊరిలో కాయకష్టం చేస్తున్న ఆ భర్తకు కమ్మక ద్రోహి భార్య నిలువునా మోసగించింది. ఇద్దరు పిల్లలను ఆ అభాగ్యుడికి లేకుండా చేసి, అతడి జీవితాన్ని అంధకారం చేసింది.

    - Advertisement -
    - Advertisement -
    Must Read
    Related News