HomeUncategorizedViral Video | కూతురిని వేధించిన వ్యక్తిని ఉతికి ఆరేసిన తల్లి.. వీడియో వైరల్​

Viral Video | కూతురిని వేధించిన వ్యక్తిని ఉతికి ఆరేసిన తల్లి.. వీడియో వైరల్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Viral Video : కూతురిని లైంగికంగా వేధిస్తున్న వ్యక్తిని ఓ తల్లి చితకబాదింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో చోటుచేసుకుంది. రోడ్డు మీద జనం మధ్యే చెప్పుతో చెడామడా వాయించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

హమీర్‌పూర్‌లోని ముస్కారా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. బాధితురాలి తల్లి ఆ కామాంధుడిని చెప్పుతో కొట్టినట్లు వీడియోలో ఉంది. వైరల్ అయిన వీడియో ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

సదరు కీచకుడు గత కొన్ని రోజులుగా బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బాలిక తల్లికి ఫిర్యాదు చేసింది. ఉగ్రకాళిగా మారిన ఆ తల్లి.. నిందితుడిని రోడ్డు మీద పట్టుకుని దేహశుద్ధి చేసింది. శివ కుమార్ సాహుగా గుర్తించబడిన ఆ దుర్మార్గుడు బండా నివాసి. నిందితుడు ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడు. ఈ విషయానికి సంబంధించి బాలిక కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.

Must Read
Related News