Homeజిల్లాలునిజామాబాద్​Mla Sudarshan Reddy | విద్యావంతులను గెలిపిస్తే మరింత అభివృద్ధి: ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి

Mla Sudarshan Reddy | విద్యావంతులను గెలిపిస్తే మరింత అభివృద్ధి: ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి

విద్యావంతులను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి అన్నారు. సాలూర, జాడిజమాల్​పూర్​ తదితర గ్రామాల్లో సర్పంచ్​ అభ్యర్థులుగా నిలబడిన కాంగ్రెస్​ మద్దతుదారుల తరపున ప్రచారం నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, బోధన్: Mla Sudarshan Reddy | విద్యావంతులను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి (Mla Sudarshan Reddy) అన్నారు. బోధన్​ డివిజన్​లోని (Bodhan division) సాలూర, జాడిజమాల్​పూర్త గ్రామాల్లో సర్పంచ్​ అభ్యర్థులుగా నిలబడిన కాంగ్రెస్​ మద్దతుదారులతో కలిసి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు కాంగ్రెస్ అంటే భరోసా అనే నమ్మకం కలిగిందన్నారు. గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్​ మద్దతుదారులను గెలిపించుకోవాలని సూచించారు. జాడిజమాల్​పూర్​లో (Jadijamalpur) చిన్న వయసులో విద్యావంతురాలు నిహారిక సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం గ్రామస్థుల అదృష్టంగా భావించాలన్నారు.

గ్రామంలో విద్యావంతురాలు ప్రజాప్రతినిధిగా ఉంటే ప్రజలకు ఉత్తమ సేవలు అందడంతో పాటు అభివృద్ధి సులభతరం అవుతుందన్నారు. కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ గంగా శంకర్, పార్టీ బోధన్ మండలాధ్యక్షుడు నాగేశ్వరరావు, సాలూర పీఏసీఎస్​ ఛైర్మన్ అల్లె జనార్దన్​, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుందర్ రాజు, అల్లె రమేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News