అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mohammad Nawaz | ఆసియా కప్ 2025 ప్రారంభానికి ముందు పాకిస్తాన్‌కు మంచి ఊరట లభించింది. ఆ జట్టులో కీలకమైన స్పిన్నర్ మొహమ్మద్ నవాజ్ అద్భుత ఫామ్‌లోకి వచ్చాడు. తాజాగా దుబాయ్ వేదికగా యూఏఈ, పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన ట్రై సిరీస్‌లో నవాజ్ తన ఆల్‌రౌండ్ ప్రతిభతో కట్టిపడేసాడు.
ముఖ్యంగా ఫైనల్‌లో అప్ఘనిస్తాన్‌పై ఐదు వికెట్ల హౌల్‌తో పాకిస్తాన్(Pakistan)కు ఘన విజయం అందించాడు. కీలక సమయంలో బౌలింగ్‌కు వచ్చిన నవాజ్, కేవలం 19 పరుగులకే ఐదు కీలక వికెట్లు తీయడం విశేషం. అందులో రసూలీ, అజ్మతుల్లా ఓమర్జాయి, ఇబ్రహీం జర్దాన్‌ను వరుసగా తీసుకొని హ్యాట్రిక్ నమోదు చేశాడు. తన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు.
Mohammad Nawaz | నవాజ్‌కి పరీక్ష
మొత్తం సిరీస్‌లో పది వికెట్లు పడగొట్టిన నవాజ్, బ్యాటింగ్‌లోనూ అవసరమైన సమయంలో ఫినిషింగ్ టచ్ అందించాడు. ఒకప్పుడు 2022 టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ వేయడంలో విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నవాజ్(Mohammad Nawaz), ఇప్పుడు తన బౌలింగ్ లో పదును పెంచుకున్నాడని ట్రై సిరీస్ ప్రదర్శన స్పష్టం చేస్తోంది. అప్పటి నవాజ్, ఇప్పటి నవాజ్‌ను పోల్చితే స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సెప్టెంబర్ 10న భారత్ తన తొలి మ్యాచ్ యూఏఈతో ఆడనుండగా, సెప్టెంబర్ 14న భారత్ – పాక్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే నవాజ్ స్పిన్‌తో ఆకట్టుకుంటుండటంతో, భారత బ్యాటింగ్ లైనప్ అతనిని ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఆసియా కప్(Asia Cup 2025) సెప్టెంబర్ 9, 2025న ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు ఆడనున్నాయి. ఫైనల్ సెప్టెంబర్ 28న దుబాయ్ వేదికగా జరగనుంది. అయితే ఈ టోర్నీలో భారత్- పాక్ రెండు సార్లు తలపడే అవకాశం ఉంది. మొదట సెప్టెంబర్ 14న భారత్ -పాక్ తొలిసారి తలపడనున్నాయి. ఆ తర్వాత రెండు సెమీస్‌కి చేరుకుంటే అప్పుడు ఒకసారి పోటీ పడే అవకాశం లేకపోలేదు. అయితే పాక్‌కి స్పిన్ అస్త్రంగా మారిన నవాజ్, ఆసియా కప్‌లో టీమిండియా(Team India)పై ప్రభావం చూపిస్తాడా లేదా అన్నది మరో రెండు వారాల్లో తేలనుంది.
