Mallareddy | మోదీజీ పాకిస్తాన్‌ని లేపేయండి : మాజీ మంత్రి మల్లారెడ్డి

Mallareddy | మోదీజీ పాకిస్తాన్‌ని లేపేయండి: మాజీ మంత్రి మల్లారెడ్డి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mallareddy | పాకిస్తాన్​ను ప్రపంచ పటంలో లేకుండా చేయాలని మాజీ మంత్రి మల్లారెడ్డి ex minister mallareddy అన్నారు. భారత్ – పాక్​ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్మీకి సంఘీభావంగా శనివారం మల్లారెడ్డి కాలేజీలో ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పాక్​ పక్కలో బల్లెంలా తయారు అయిందన్నారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని మండిపడ్డారు. 75 ఏళ్ల నుంచి మనం పాకిస్తాన్​తో బాధలు పడుతూనే ఉన్నామన్నారు. పాకిస్తాన్​లోని ఉగ్రవాదాన్ని అంతం చేయాలని మోదీని కోరారు. మరోసారి భారత్​ వైపు చూడాలంటే పాక్​ వణికిపోయేలా చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భారత సైన్యానికి బీఆర్​ఎస్​ పార్టీ, తెలంగాణ ప్రజలు అండగా ఉంటారన్నారు.