Homeతాజావార్తలుPM Modi | హైదరాబాద్​లో ప్రైవేట్​ రాకెట్​ ఫ్యాక్టరీ.. ప్రారంభించిన మోదీ

PM Modi | హైదరాబాద్​లో ప్రైవేట్​ రాకెట్​ ఫ్యాక్టరీ.. ప్రారంభించిన మోదీ

హైదరాబాద్​ నగరంలో అంతరిక్ష స్టార్టప్ స్కైరూట్స్ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశంలోనే ఇది అతిపెద్ద ఫ్యాక్టరీగా నిలవనుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రైవేట్​ రాకెట్​ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీ నుంచి వర్చువల్​గా దీనిని ప్రారంభించారు.

అంతరిక్ష స్టార్టప్ స్కైరూట్స్ ఇన్ఫినిటీ క్యాంపస్‌లో మొదటి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-Iని కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టగల సామర్థ్యం స్కైరూట్ కలిగి ఉంది. ఈ క్యాంపస్​ దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్​ రాకెట్‌ ఫ్యాక్టరీ (Private Rocket Factory) కావడం గమనార్హం. ప్రధాని మోదీ (Modi) మాట్లాడుతూ.. స్కైరూట్‌ టీమ్​ అభినందనలు తెలిపారు. అంతరిక్ష రంగంలో ఇది ఒక్క గొప్ప మైలురాయి అని ఆయన అభివర్ణించారు. భారత అంతరిక్ష రంగం రానున్న రోజుల్లో మరిన్ని ఘనతలు సాధిస్తుందన్నారు.

PM Modi | ఇన్ఫినిటీ క్యాంపస్ గురించి..

కొత్తగా నిర్మించిన అత్యాధునిక సౌకర్యం దాదాపు 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అనేక ప్రయోగ వాహనాలను రూపొందించడం, అభివృద్ధి చేయడం, సమగ్రపరచడం పరీక్షించడం కోసం దీనిని ఏర్పాటు చేశారు. నెలకు ఒక ఆర్బిటల్ రాకెట్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. ఐఐటీ పూర్వ విద్యార్థులు, ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు (Former ISRO Scientists) పవన్ చందన, భరత్ డాకా దీనిని స్థాపించారు. ఈ కంపెనీ నవంబర్ 2022లో భారతదేశం మొట్టమొదటి ప్రైవేట్‌గా అభివృద్ధి చేసిన సబ్-ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-ఎస్‌ను ప్రయోగించడం ద్వారా చరిత్ర సృష్టించింది.

Must Read
Related News