అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Navi Mumbai | ముంబై నగరం ఎప్పుడు సందడిగానే ఉంటుంది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సింగిల్ రన్‌వే ఎయిర్‌పోర్ట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CSMIA) ద్వారా ప్రయాణికులకు సేవలు అందుతూనే ఉన్నాయి.
అయితే ఇప్పుడు ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం (MMR) విమానయాన ప్రయాణంలో మరో కొత్త అధ్యాయనానికి నాంది పలికింది. ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 8న నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (Navi Mumbai International Airport – NMIA) ప్రారంభించారు. ఈ గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ (greenfield project) భారతదేశ విమానయాన రంగాన్ని మరో స్థాయికి తీసుకెళ్లనుంది.
Navi Mumbai | మోదీ చేతుల మీదుగా..
అదానీ గ్రూప్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా ఉంటుంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఈ విమానాశ్రయానికి సామాజిక కార్యకర్త డి.బి. పాటిల్ పేరు పెట్టాలని ప్రతిపాదించారు. ఈ విమానాశ్రయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తరువాత, ఏటా దాదాపు 90 మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించనున్నారు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద విమానాశ్రయాలలో ఒకటిగా మారనుంది. ప్రారంభ దశలో సంవత్సరానికి 20 మిలియన్ల ప్రయాణికులను చేరవేసే సామర్థ్యంతో 400కి పైగా రోజువారీ విమానాలను నిర్వహించనున్నారు. తొలిదశలో 60 విమానాలతో (Flights) ప్రారంభించి, ఆరు నెలల్లో ఈ సంఖ్యను 300కు పెంచే యోచనలో ఉన్నారు.
విమానాశ్రయం మొదటి రోజునుంచే దేశీయ, అంతర్జాతీయ విమానాలను (international flights) ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఏవైనా ఆలస్యం జరిగినా, అక్టోబర్ లోపల మాత్రం ఈ రెండు సేవలు ప్రారంభం కానున్నాయి. దేశీయ, అంతర్జాతీయ విమానాల నిష్పత్తిని ప్రణాళికాబద్ధంగా 4:1గా ఉంచినప్పటికీ, భవిష్యత్తులో డిమాండ్ ఆధారంగా మార్గాలు పెంచే అవకాశం ఉంది. విమానాశ్రయ నిర్మాణం కోసం మొదటి దశలో రూ.19,646 కోట్ల వరకు వ్యయం అయినట్టు అంచనా.
ఇందులో నిర్మించిన రన్‌వే (Run way) అన్ని రకాల విమానాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యం కోసం అత్యాధునిక సాంకేతికతతో ఆటోమేటెడ్ పీపుల్ మూవర్ సిస్టమ్ అమలు చేస్తున్నారు. ఇది భూగర్భ సొరంగాల ద్వారా అన్ని టెర్మినల్స్‌ను అనుసంధానిస్తుంది. ప్రయాణికుడు ఏ టెర్మినల్ నుంచైనా చెక్ ఇన్ చేయవచ్చు
నవీ ముంబై ఎయిర్‌పోర్ట్ అనేక రవాణా మార్గాలతో అనుసంధానించబడి ఉంది. రోడ్డు, రైలు, జలమార్గాల ద్వారా ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కి చేరవచ్చు. టార్ఘర్ నుంచి వాటర్ టాక్సీలు నడపబడతాయి. అలాగే ముంబైకి చెందిన CSMIA ఎయిర్‌పోర్ట్‌ను నవీ ముంబై ఎయిర్‌పోర్ట్‌తో అనుసంధానించేందుకు కొత్త “గోల్డ్ లైన్” (Gold Line) మెట్రో నిర్మాణం కూడా ప్రణాళికలో ఉంది. మొత్తంగా చూస్తే, నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశం అంతటా విమానయాన రంగాన్ని పునర్నిర్వచించే అవకాశమున్న ప్రాజెక్టుగా నిలవనుంది. అత్యాధునిక సౌకర్యాలు, విస్తృత అనుసంధానతతో ఇది ప్రజలకు కొత్త ప్రయాణ అనుభవాన్ని అందించబోతోంది.
అయితే నరేంద్ర మోదీ (PM Narendra Modi) తన ట్విట్టర్‌లో ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. ‘నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి నవీ ముంబైకి బయలుదేరుతున్నాను. ఈ సందర్భంగా మొదటి దశ ప్రారంభంకానుంది. దీంతో ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతానికి రెండో అంతర్జాతీయ విమానాశ్రయం లభించనుంది.
ఇది వాణిజ్యానికి, కనెక్టివిటీకి నూతన ఉత్తేజం ఇవ్వనుంది. అలాగే ముంబై మెట్రో లైన్-3 చివరి దశను కూడా ప్రారంభించనున్నాను. ముంబై నగర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం మా కృషి కొనసాగుతూనే ఉంటుంది. నగర ప్రజలకు ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ను అందించేందుకు మేము ఎల్లప్పుడు కృషి చేస్తూనే ఉంటాము’ అని రాసుకొచ్చారు.
On the way to Navi Mumbai to take part in the programme marking the inauguration of Phase-1 of the Navi Mumbai International Airport. With this, the Mumbai Metropolitan Region will get its second major international airport, thus boosting commerce and connectivity. The final… pic.twitter.com/t6v82O6Een
— Narendra Modi (@narendramodi) October 8, 2025
