అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | జీఎస్టీ(GST) సంస్కరణలపై స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) చేసిన ప్రకటన మార్కెట్లకు బూస్ట్ ఇచ్చింది. ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ మన దేశ రేటింగ్‌ను బీబీబీ(-) నుంచి బీబీబీ కి మార్చడంతో ఇన్వెస్టర్లలో మరింత నూతనోత్సాహం వచ్చింది.
యూఎస్ అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ అనంతరం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మారింది. అమెరికా వాణిజ్య సుంకాలను(Tariffs) తగ్గించవచ్చు అన్న అంచనాలతో పాజిటివ్‌గా మారారు. దీంతో సూచీలు పరుగులు తీస్తున్నాయి. అన్ని రంగాల షేర్లు రాణిస్తున్నాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్ 718 పాయింట్ల భారీ గ్యాప్ అప్‌తో ప్రారంభమై అక్కడినుంచి మరో 450 పరుగులు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో 278 పాయింట్లు పడిపోయింది. 307 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన నిఫ్టీ(Nifty) అక్కడినుంచి మరో 84 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 138 పాయింట్లు తగ్గింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్(Sensex) 813 పాయింట్ల లాభంతో 81,410 వద్ద, నిఫ్టీ 286 పాయింట్ల లాభంతో 24,918 వద్ద కొనసాగుతున్నాయి.
ఆటో సెక్టార్‌లో భారీ లాభాలు..
ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లు మినహా మిగిలిన అన్ని సెక్టార్ల స్టాక్స్ భారీ లాభాలతో సాగుతున్నాయి. బీఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్ 0.33 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ 0.27 శాతం నష్టాలతో ఉన్నాయి. ఆటో ఇండెక్స్(Auto index) 4.69 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్ 3.03 శాతం, క్యాపిటల్ మార్కెట్ 2.72 శాతం, రియాలిటీ 2.32 శాతం, కమోడిటీ 2 శాతం, మెటల్ 1.74 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.59 శాతం, ఎఫ్‌ఎంసీజీ 1.58 శాతం, టెలికాం 1.56 శాతం లాభాలతో సాగుతున్నాయి. స్మాల్ క్యాప్(Small cap) ఇండెక్స్ 1.43 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 1.41 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.37 శాతం లాభాలతో కదలాడుతున్నాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 20 కంపెనీలు లాభాలతో ఉండగా.. 10 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. మారుతి 9.28 శాతం, బజాజ్ ఫైనాన్స్ 5.88 శాతం, ఎంఅండ్‌ఎం 4.93 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 4.36 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 4.32 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఎల్‌టీ 1.25 శాతం, ఇన్ఫోసిస్ 0.87 శాతం, సన్ ఫార్మా 0.79 శాతం, ఐటీసీ 0.72 శాతం, ఎటర్నల్ 0.58 శాతం నష్టాలతో ఉన్నాయి.