Mock Drill | మరికొద్దిసేపట్లో మోగనున్న ‘సైరన్’​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mock Drill | పాక్​తో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలోని పలు నగరాల్లో మాక్​ డ్రిల్​ నిర్వహించాలని కేంద్ర హోం శాఖ ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఆపరేషన్​ అభ్యాస్​ పేరిట హైదరాబాద్​లో మాక్​ డ్రిల్​ నిర్వహిస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్​ తెలిపారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటకు సైనర్​ మోగుతుందన్నారు. కేంద్రం ఆపరేషన్​ సిందూర్​ చేపట్టి ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో శత్రుదేశాలు దాడి చేస్తే […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mock Drill | పాక్​తో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలోని పలు నగరాల్లో మాక్​ డ్రిల్​ నిర్వహించాలని కేంద్ర హోం శాఖ ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఆపరేషన్​ అభ్యాస్​ పేరిట హైదరాబాద్​లో మాక్​ డ్రిల్​ నిర్వహిస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్​ తెలిపారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటకు సైనర్​ మోగుతుందన్నారు. కేంద్రం ఆపరేషన్​ సిందూర్​ చేపట్టి ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో శత్రుదేశాలు దాడి చేస్తే ఎలా తప్పించుకోవాలో అవగాహన కల్పించడానికి మాక్​ డ్రిల్​ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

రెండు నిమిషాల పాటు సైరన్​ మోగుతుందని, గంట పాటు మాక్​ డ్రిల్​ నిర్వహిస్తామని తెలిపారు. దీనిపై సీఎం రేవంత్​రెడ్డి సైతం అధికారులతో సమావేశం నిర్వహించి, అప్రమత్తం చేశారన్నారు. ఇది కేవలం ప్రజలను అప్రమత్తం చేయడానికి మాత్రమే అని ఆయన తెలిపారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత వార్​ సైరన్​ మోగుతున్నట్లు ఆయన తెలిపారు. సైరన్ మోగినప్పుడు ఇంట్లో ఉన్నవాళ్లు ఇంటికే పరిమితం కావాలని సూచించారు. బయట ఉన్న వాళ్లు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...