అక్షరటుడే, వెబ్డెస్క్ : Mock Drill | పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలోని పలు నగరాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర హోం శాఖ ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఆపరేషన్ అభ్యాస్ పేరిట హైదరాబాద్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటకు సైనర్ మోగుతుందన్నారు. కేంద్రం ఆపరేషన్ సిందూర్ చేపట్టి ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో శత్రుదేశాలు దాడి చేస్తే ఎలా తప్పించుకోవాలో అవగాహన కల్పించడానికి మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
రెండు నిమిషాల పాటు సైరన్ మోగుతుందని, గంట పాటు మాక్ డ్రిల్ నిర్వహిస్తామని తెలిపారు. దీనిపై సీఎం రేవంత్రెడ్డి సైతం అధికారులతో సమావేశం నిర్వహించి, అప్రమత్తం చేశారన్నారు. ఇది కేవలం ప్రజలను అప్రమత్తం చేయడానికి మాత్రమే అని ఆయన తెలిపారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత వార్ సైరన్ మోగుతున్నట్లు ఆయన తెలిపారు. సైరన్ మోగినప్పుడు ఇంట్లో ఉన్నవాళ్లు ఇంటికే పరిమితం కావాలని సూచించారు. బయట ఉన్న వాళ్లు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.