అక్షరటుడే, ఎల్లారెడ్డి: Mla Laxmi Kantha Rao | సీఎం రేవంత్‌రెడ్డితో (CM Revanth reddy) జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మంగళవారం భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) సమీపిస్తున్న నేపథ్యంలో జుక్కల్ నియోజకవర్గంలో (Jukkal Constituency) పార్టీ పరిస్థితులపై సీఎంకు వివరించారు.
నిరంతరం తాను ప్రజల మధ్య ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నానని వివరించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుండడం, ప్రభుత్వ పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామని, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. వరదల సమయంలో రాత్రి, పగలు తేడా లేకుండా శ్రమించి ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలిచినందుకు సీఎం ప్రత్యేకంగా అభినందించారని పేర్కొన్నారు.