Homeజిల్లాలుకామారెడ్డిJukkal MLA | పీసీసీ చీఫ్​తో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు భేటీ

Jukkal MLA | పీసీసీ చీఫ్​తో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు భేటీ

పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్​తో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్​లో గెలుపుపై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Jukkal MLA | పీసీసీ చీఫ్ మహేశ్​ గౌడ్​​తో ఎమ్మెల్యే తోట లక్ష్మీరాంతారావు (MLA Thota Lakshmi Kantarao) భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by-election) కాంగ్రెస్​ అభ్యర్థి నవీన్​ యాదవ్​ విజయం సాధించడంతో పీసీసీ చీఫ్​కు హైదరాబాద్​లోని ఆయన నివాసంలో శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్​ఎంసీ ఎన్నికలపై వారు చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ.. ఈ విజయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల సమష్టి కృషికి నిదర్శనమన్నారు. ప్రతి ఒక్కరు ఏకతాటిపై నిలిచి పార్టీ గెలుపు కోసం ఐక్యంగా పని చేశారని అన్నారు. ఈ గెలుపు ఇచ్చిన స్ఫూర్తితో రాబోయే ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Must Read
Related News