HomeUncategorizedMLA arrest | దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అరెస్టు

MLA arrest | దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అరెస్టు

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: MLA arrest : పహల్గవ్​ మారణహోమంపై ఓవైపు దేశమంతా ఆవేదన, ఆగ్రహం వ్యక్తమవుతున్న తరుణంలో ఆలిండియా యూనైటెడ్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) ఎమ్మెల్యే జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డాడు. 26 మందిని బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి దేశ వ్యతిరేక ప్రకటనలు చేయడంతో గురువారం అస్సాంలోని నాగావ్ జిల్లాలోని థింగ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంను పోలీసులు అరెస్టు చేశారు. వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రచారంలో పాల్గొన్న ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆయన్ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

MLA arrest : స్పందించిన ముఖ్యమంత్రి

ఇస్లాం అరెస్టుపై ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్పందించారు. చేసిన పనికి తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. ఇస్లాం చేసిన వ్యాఖ్యలు అస్సాం ప్రజలను ఆగ్రహానికి గురి చేశాయి. దేశ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలపై రాష్ట్ర పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. (అతని వ్యాఖ్యలకు) సరైన న్యాయం జరిగేలా కోర్టు ముందు హాజరుపరుస్తారని నేను ఆశిస్తున్నాను”అని ముఖ్యమంత్రి శర్మ అన్నారు. పహల్గామ్ దాడిలో మరణించిన 26 మంది కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.5 లక్షలు అందిస్తామన్నారు. అదే సమయంలో పాకిస్తాన్కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతు ఇస్తున్న వారికి, అస్సాంలో అలాంటి కార్యకలాపాలను సహించబోమని స్పష్టం చేశారు. మరోవైపు, ఎమ్మెల్యే ఇస్లాం వ్యాఖ్యలను ఏఐడీయూఎఫ్ అధ్యక్షుడు బద్రుద్దీన్ అజ్మల్ ఖండించారు. ఆయన వ్యాఖ్యలను దురదృష్టకరమని, పార్టీ దానిని సమర్థించడం లేదని అన్నారు. “ఇది చాలా దురదృష్టకర ప్రకటన. ఈ దశలో మనం అలాంటి ప్రకటనలు చేయకూడదు. ఇస్లాం చేసిన వ్యాఖ్యలు అతని వ్యక్తిగత హోదాలో ఉన్నాయి. వాటిని మేము సమర్థించం” అని అజ్మల్ అన్నారు.