HomeతెలంగాణKonda Surekha | కొండంత చిక్కుల్లో మంత్రి సురేఖ.. అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతోంది?

Konda Surekha | కొండంత చిక్కుల్లో మంత్రి సురేఖ.. అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతోంది?

Konda Surekha | మంత్రి కొండా సురేఖ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా మంత్రి మాజీ ఓఎస్డీని అరెస్ట్​ చేయడానికి పోలీసులు ఆమె ఇంటికి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Konda Surekha | మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్​ఫోర్స్​ పోలీసులు (Task Force Police) మఫ్టీలో వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఓ మంత్రి ఇంట్లో ఉన్న వ్యక్తిని అరెస్ట్​ చేయడానికి పోలీసులు అర్ధరాత్రి వెళ్లడం.. వారిని మంత్రి కుమార్తె అడ్డుకోవడం కాంగ్రెస్​లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

మంత్రి కొండా సురేఖ అనేక వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి ఆమె వ్యవహరంతో అటు ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్​ పార్టీ ఇరకాటంలో పడుతున్నాయి. గతంలో ఓ హీరోయిన్​ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆమె భర్త కొండా మురళి (Konda Murali) సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేశారు. దీంతో వరంగల్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు ఇప్పటికే కొండా సురేఖకు వ్యతిరేకంగా ఏకం అయ్యారు. ఇటీవల ఆమె భర్త మురళి పొంగులేటిపై హైకమాండ్​కు ఫిర్యాదు చేయడంతో వార్తల్లో నిలిచారు.

Konda Surekha | ముఖ్యమంత్రిపైనే ఆరోపణలు

కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ (OSD Sumanth)​ మంత్రుల మధ్య విభేదాలు వచ్చేలా సమాచారం లీక్​ చేస్తున్నారని ఇటీవల ప్రభుత్వం సస్పెండ్​ చేసింది. అంతేగాకుండా ఆయన అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. డెక్కన్​ సిమెంట్ యాజమాన్యాన్ని తుపాకీతో బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. అరెస్ట్ చేయాలని భావించింది. అయితే పదవి నుంచి తొలగించినా సుమంత్​ మంత్రి ఇంట్లోనే తల దాచుకుంటున్నారని తెలిసి టాస్క్​ఫోర్స్​ పోలీసులు ఆయనను అరెస్ట్​ చేయడానికి బుధవారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా వారిని సురేఖ కూతురు సుష్మిత అడ్డుకున్నారు.

ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలు చేశారు. డెక్కన్​ సిమెంట్​ వ్యవహారంలో సీఎం రేవంత్​రెడ్డికి సన్నిహితంగా ఉండే రోహిణ్​రెడ్డి సుమంత్​ను ఏమిటి మ్యాటర్​ అడిగారన్నారు. ఆ సమయంలో అందరు కలిసి మాట్లాడారని చెప్పారు. దానిని బెదిరించడం అనరు అని ఆమె పేర్కొన్నారు. ఒకవేళ అవి బెదిరింపులు అయితే ఆ కేసులో రోహిణ్​రెడ్డి, సీఎం రేవంత్​రెడ్డి కూడా ఉండాలని వ్యాఖ్యలు చేశారు. ఆమె నేరుగా CMO తప్పు చేసిందని ఆరోపించారు.

Konda Surekha | అణచివేసే కుట్ర

తన తండ్రి కొండా మురళిని తొక్కివేయాలని కొందరు కుట్రలు చేస్తున్నారని సుష్మిత ఆరోపించారు. తన ఇంటి చుట్టు మఫ్టీలో పోలీసులను ఉంచాల్సిన అవసరం ఏముందని ఆమె ప్రశ్నించారు. అసలు తాము కాంగ్రెస్​ ప్రభుత్వంలో లేమ అని నిలదీశారు. తన తండ్రిపై తప్పుడు కేసులు పెట్టి ఇరికించే కుట్ర జరుగుతుందని ఆమె ఆరోపించారు.

Konda Surekha | తీవ్ర కలకలం

ఓ మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి మంత్రి ఆశ్రయం ఇవ్వడం గమనార్హం. ఆయనను కాపాడాలని కొండా ఫ్యామిలీ ఎందుకు చూస్తుందో తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆయన అరెస్ట్​ అయితే.. తర్వాత మురళిని కూడా ఇరికిస్తారని సుష్మిత ఆరోపించారు. మరోవైపు మంత్రితో నేరుగా సీఎం మాట్లాడి అతడి అరెస్ట్​కు సహకరించేలా చూస్తే బాగుండేది. అలా కాకుండా పోలీసులను పంపడంతో కాంగ్రెస్​లో సంక్షోభానికి అద్దం పడుతోంది. ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి.