అక్షరటుడే, భీమ్గల్: Minister Seethakka | రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క (Minister Seethakka) బుధవారం మెండోరా మండలంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఆమె మెండోరా గ్రామానికి (Mendora village) చేరుకుంటారు.
Minister Seethakka | సీఆర్‌ఆర్ నిధులతో రహదారి నిర్మాణం..
మెండోరా గ్రామం నుంచి నర్సాపూర్ వరకు సుమారు రూ.1.85 కోట్ల సీఆర్‌ఆర్ (CRR) (Central Road Fund) నిధులతో నిర్మించనున్న బీటీ రహదారి పనులకు మంత్రి ఈ సందర్భంగా శంకుస్థాపన చేస్తారు. ప్రజల రవాణా సౌకర్యార్థం ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసింది. మంత్రి పర్యటన దృష్ట్యా మెండోరా ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సర్పంచ్ కుంట లక్ష్మి రమేష్ కోరారు. పనుల శంకుస్థాపన అనంతరం మంత్రి స్థానిక సమస్యలపై నాయకులతో చర్చించే అవకాశం ఉందన్నారు.