అక్షరటుడే, భీమ్గల్ : Alive Arrive | రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీస్ కమిషనరేట్ (Nizamabad Police Commissionerate) ఆధ్వర్యంలో చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ (ARRIVE ALIVE) కార్యక్రమాన్ని భీమ్గల్లో (Bheemgal) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క (Minister Seethakka) వాహనదారులకు అవగాహన కల్పించేందుకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆమె సైతం హెల్మెట్ ధరించి ర్యాలీలో పాల్గొన్నారు.
Alive Arrive | నిబంధనలు పాటిస్తేనే ప్రాణాలకు రక్షణ..
ఈ సందర్భంగా మంత్రి సీతక్క (Minister Seethakka) మాట్లాడుతూ.. వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం ప్రాణాంతకమని హెచ్చరించారు. ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్నదే పోలీస్ శాఖ ఉద్దేశమని పేర్కొన్నారు. బాల్కొండ నియోజకవర్గ (Balkonda constituency) కాంగ్రెస్ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ మంత్రి సీతక్కతో కలిసి ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. నియోజకవర్గ స్థాయి నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
