Homeతాజావార్తలుMinister Ponguleti | నాపై ఫిర్యాదు చేశారంటే నమ్మబుద్దయిత లేదు.. కాంట్రాక్టు కోసం తాపత్రాయపడే వాడ్ని...

Minister Ponguleti | నాపై ఫిర్యాదు చేశారంటే నమ్మబుద్దయిత లేదు.. కాంట్రాక్టు కోసం తాపత్రాయపడే వాడ్ని కాదన్న మంత్రి పొంగులేటి

రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క తనపై ఫిర్యాదు చేశారంటే నమ్మబుద్ధి కావడం లేదని వ్యాఖ్యానించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | మేడారం అభివృద్ధి పనుల్లో టెండర్ల వ్యవహారంపై సహచర మంత్రుల నుంచే వచ్చిన ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) స్పందించారు. మంత్రులు కొండా సురేఖ (Ministers Konda Surekha), సీతక్క తనపై ఫిర్యాదు చేశారంటే నమ్మబుద్ధి కావడం లేదని చెప్పారు.

రూ.70 కోట్ల కాంట్రాక్టు పనుల కోసం తాపత్రాయపడే వ్యక్తిని స్పష్టం చేశారు. తాను ఏమిటో, ఎలాంటి వాడినో అందరికీ తెలుసన్నారు. తన మీద ఫిర్యాదు చేయడానికి ఏముందని ప్రశ్నించారు. కొండా సురేఖ, సీతక్క (Minister Seethakka) సమ్మక్క, సారలమ్మలా కలిసి పని చేస్తున్నారని తెలిపారు. మేడారం అభివృద్ధి (Medaram development) పనులను మంత్రులు పొంగులేటి, సీతక్క సోమవారం పరిశీలించారు. గద్దెల అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. తనపై వచ్చిన విమర్శలను తోసిపుచ్చారు.

Minister Ponguleti | గడువులోగా పనులు పూర్తవ్వాలి..

మేడారం అభివృద్ధి పనులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోందని మంత్రి పొంగులేటి అన్నారు. నిర్దేశిత గడువులోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మేడారం అభివృద్ధికి రూ.212 కోట్లు కేటాయించామని, అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామని చెప్పారు. మేడారంలో భక్తులకు అన్ని రకాల వసతులు ఉండాలన్నారు. మేడారం ఆలయ (Medaram temple) అభివృద్ధికి అందరి సలహాలు తీసుకుంటామన్నారు. కేవలం ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనుల కోసమే రూ.101 కోట్లు కేటాయించామని తెలిపారు. ఎన్ని కోట్లు ఖర్చయినా సరే మేడారం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు.

Minister Ponguleti | పొంగులేటిపై రుసరుస..

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి దేవాదాయ శాఖ పనుల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆ శాఖ మంత్రి కొండా సురేఖ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు. పొంగులేటి తన సొంత కంపెనీలకు కాంట్రాక్టు పనులు ఇప్పించుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. వరంగల్ జిల్లా (Warangal district) రాజకీయాల్లోనూ మితిమీరి జోక్యం చేసుకుంటున్నారన్నారు. మరోవైపు, తన నియోజకవర్గ పరిధిలోని మేడారంలో జరిగే అభివృద్ధి పనులకు సంబంధించి తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వకపోవడాన్ని మరో మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రితో పాటు పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయితే, సహచర మంత్రుల ఫిర్యాదులపై తాజాగా పొంగులేటి స్పందించారు. వారు ఫిర్యాదు చేశారంటే నమ్మబుద్ధి కావడం లేదన్నారు.