Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | మంత్రి కోమటిరెడ్డిని బర్తరఫ్ చేయాలి

Kamareddy | మంత్రి కోమటిరెడ్డిని బర్తరఫ్ చేయాలి

నల్గొండలో బీసీ సర్పంచ్ అభ్యర్థి భర్తతో అమానుషంగా ప్రవర్తించిన ఘటనపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ భగ్గుమంది. జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దిష్టిబొమ్మను తగులబెట్టేందుకు నాయకులు యత్నించారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | నల్గొండ జిల్లాలో బీసీ సర్పంచ్ అభ్యర్థి భర్తకు మూత్రం తాగించిన ఘటనపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ (Telangana Rajyaadhikari Party) భగ్గుమంది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) దిష్టిబొమ్మను తగులబెట్టేందుకు రాజ్యాధికార పార్టీ నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

మంత్రి దిష్టిబొమ్మను తీసుకువస్తున్న పార్టీ నాయకుల చేతిలో నుంచి దిష్టిబొమ్మను లాక్కుని ఓ కానిస్టేబుల్ పరుగెత్తాడు. దాంతో అందరూ షాక్ అయ్యారు. తాము సీఎం దిష్టిబొమ్మ తగులబెట్టడం లేదన్నారు. మంత్రి దిష్టిబొమ్మ అని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. పార్టీ నాయకులు మంత్రి చిత్రపటానికి సంబంధించిన కాగితాలు దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు పెట్రోల్ బాటిల్, కాగితాలను లాక్కున్నారు.

ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాహెర్ మాట్లాడుతూ.. ఒక బీసీ సర్పంచ్ అభ్యర్థి (BC sarpanch candidate) భర్త యాదగిరిపై అగ్రవర్ణాల పెద్దలు ప్రవర్తించిన తీరు సరికాదన్నారు. ఇది బీసీలను అణగదొక్కే కుట్ర అని పేర్కొన్నారు. సంబంధిత ఘటనకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు. తక్షణమే మంత్రిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

సర్పంచ్ ఎన్నికల్లో (sarpanch elections) బీసీలకు రిజర్వేషన్ వస్తే అగ్రవర్ణాలు తట్టుకోలేక పోతున్నారని విమర్శించారు. బీసీల పట్ల ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు. బీసీలకు తమ పార్టీ అధ్యక్షుడు మల్లన్న అండగా ఉంటారని తెలిపారు. బీసీలు రాజ్యాధికారం చేపట్టే దిశగా ప్రజలు ఆలోచించి ఓటు వేసి అగ్రవర్ణాల పెత్తనాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాజ్యాధికార పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొక్కల సంతోషి, టౌన్ ప్రెసిడెంట్ మామిండ్ల సిద్దరాములు, రాజంపేట అధ్యక్షుడు అనిల్, భిక్కనూర్ అధ్యక్షుడు సాయిచంద్ర కిరణ్, మాహిళా నాయకులు స్వాతి, నవీన, సమత, జావీద్ పాల్గొన్నారు.

Must Read
Related News