అక్షరటుడే, వెబ్డెస్క్: Minister Komatireddy | రైతు కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అండగా నిలిచారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న అన్నదాత కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు.
సిద్దిపేట జిల్లా (Siddipet District) నంగునూరు మండలం ఘనపూర్ గ్రామం (Ghanapur Village)లో రాజిరెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజిరెడ్డి రెండెకరాల భూమిలో రెండు బోర్లు వేసినా నీళ్లు రాలేదు. దీంతో పశువుల వ్యాపారం చేశాడు. అందులోనూ నష్టపోయాడు. దీంతో రూ.5 లక్షల వరకు అప్పులు అయ్యాయి. అప్పులు ఎలా తీర్చాలని రాజిరెడ్డి మనోవేదనకు గురయ్యేవాడు. ఈ క్రమంలో అప్పులు తీర్చే మార్గం లేక శనివారం రాత్రి గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించి మృతి చెందాడు.
రాజిరెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి మంగళవారం ఉదయం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి ధైర్యం చెప్పారు. రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. అలాగే ప్రభుత్వం తరఫున అందే రైతు బీమా (Rythu Bheema) సహాయం తక్షణమే అందేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.