అక్షరటుడే, బోధన్ : Bodhan Municipality | బోధన్ మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లను ఊడ్చేందుకురూ.లక్షలు వెచ్చించి తీసుకొచ్చిన స్వీపింగ్ మిషన్ (Sweeping Machine) వృథాగా పడి ఉంది. రెండేళ్ల క్రితం రూ.75లక్షలకు పైగా వెచ్చించి ఈ స్వీపింగ్ మిషన్ను అప్పటి పాలకవర్గం కొనుగోలు చేసింది. మిషన్ను తీసుకొచ్చిన 15 రోజుల్లోనే పాడైంది.
Bodhan Municipality | మరమ్మతులకు కూడా రూ.లక్షలే..
ఈ యంత్రం మరమ్మతులకు సైతం రూ.లక్షల్లో ఖర్చు అవుతుండడంతో దానిని పక్కన పెట్టేశారు. దీంతో ప్రస్తుతం ఈ యంత్రం వానకు తడుస్తూ.. ఎండకు ఎండుతూ తుప్పు పడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ (Municipal Commissioner) జాదవ్ కృష్ణతో మాట్లాడగా.. గత పాలకవర్గం ఉన్నప్పుడు ఈ మిషన్ తీసుకొచ్చారన్నారు. ఈ యంత్రం బోధన్ (Bodhan) రోడ్లకు ఏమాత్రం పనిచేయదని వివరించారు. మరమ్మతులకు సైతం రూ.10లక్షల వరకు ఖర్చు అవుతుందని ఆయన పేర్కొన్నారు. స్వీపింగ్ మిషన్ మరమ్మతుల విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.
