అక్షరటుడే, వెబ్డెస్క్: Metro Train | సాంకేతిక కారణాలతో మెట్రోరైలు సొరంగం (Subway)లో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు నడుచుకుంటూ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ ఘటన మంగళవారం ఉదయం చెన్నైలో చోటు చేసుకుంది.
నగరంలోని విమ్కో నగర్ డిపో నుంచి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం (Chennai International Airport) వైపు వెళ్లే మెట్రో ట్రైన్‌లో సాంకేతిక సమస్య నెలకొంది. దీంతో సెంట్రల్ మెట్రో – హైకోర్టు స్టేషన్ మధ్యలో ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 5.45 గంటల ప్రాంతంలో చెన్నై సెంట్రల్ మెట్రో రైలు స్టేషన్ (Chennai Central Metro Rail station) నుంచి విమ్కో నగర్ వైపు రైలు బయలుదేరింది. కొన్ని నిమిషాల తర్వాత సొరంగం లోపల రైలు ఆగిపోయింది. అధికారులు దానిని మళ్లీ స్టార్ట్ చేసే ప్రయత్నం చేసిన ఫలించలేదు. దీంతో ప్రయాణికులను సమీపంలోని హైకోర్టు స్టేషన్‌కు నడుచుకుంటూ వెళ్లమని వారు సూచించారు. అనంతరం అక్కడి నుంచి వెరే రైళ్లలో గమ్యస్థానాలకు చేరుకున్నారు.
Metro Train | సేవలకు అంతరాయం
సొరంగంలో నిలిచిపోయిన రైలును మరొక రైలు ఉపయోగించి అక్కడి నుంచి చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. ఈ ఘటనతో చెన్నై సెంట్రల్, హైకోర్టు స్టేషన్ మధ్య దాదాపు అరగంట పాటు సేవలు నిలిచిపోయాయి. దీనిపై చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (Chennai Metro Rail Limited) స్పందించింది. రైలు నిలిచిపోవడంతో వెంటనే చర్యలు చేపట్టామని పేర్కొంది. ఆ రైలును వెంటనే ట్రాక్ నుంచి తొలగించామని, ఉదయం 6:20 గంటలకు సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయని వెల్లడించింది.
