అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Messi vs Revanth | ఉప్పల్ స్టేడియంలో (Uppal Stadium) ఈ నెల 13న ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi), సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరగనుంది. వివిధ ప్రాంతాల నుంచి ఈ మ్యాచ్‌ను చూడటానికి భారీ సంఖ్యలో అతిథులు, అభిమానులు తరలిరానున్నారు.
స్టేడియంలో ఏర్పాట్లును ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), మంత్రి శ్రీధర్‌బాబు పరిశీలించారు. డిసెంబర్ 13న జరిగే ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం స్థాయి, ఉత్సాహం ఎలా పెరుగుతుందో స్పష్టంగా కనిపించిందని శ్రీధర్‌బాబు (Minister Sridhar Babu) ఎక్స్‌లో పోస్ట్ చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేన రెడ్డి, రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు వంటి సీనియర్ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజా భద్రత మరియు ప్రధాన క్రీడా కార్యక్రమాల పట్ల తెలంగాణలో పెరుగుతున్న ఉత్సాహాన్ని ప్రతిబింబించే ఉత్సాహభరితమైన క్రీడా వాతావరణాన్ని నిర్ధారించడంపైనే ఉందని పేర్కొన్నారు.
Messi vs Revanth | ప్రత్యేక భద్రత
హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్ కోసం దేశం నలుమూలల నుంచి ప్రేక్షకులు భారీగా తరలి వస్తారని డిప్యూటీ సీఎం అన్నారు. మెస్సీకి ప్రత్యేక భద్రత వ్యవస్థ ఉంటుందన్నారు. మ్యాచ్ కోసం పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫుట్‌బాల్ ప్రేమికులు వస్తారని తెలిపాకరు. భద్రత, సౌకర్యం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని నిర్దేశించిన సమయం కంటే ముందే అభిమానులు స్టేడియానికి చేరుకోవాలని ఆయన సూచించారు. మ్యాచ్ సందర్భంగా అభిమానులకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.