Homeజిల్లాలుహైదరాబాద్GHMC | జీహెచ్​ఎంసీలో మున్సిపాలిటీల విలీనం

GHMC | జీహెచ్​ఎంసీలో మున్సిపాలిటీల విలీనం

గ్రేటర్​ హైదరాబాద్​లో ఏడు కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీల విలీనం పూర్తయింది. విలీనం మంగళవారం నుంచి అమలులోకి వచ్చినట్లు తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : GHMC | గ్రేటర్​ హైదరాబాద్​లో ఏడు కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీల విలీనం పూర్తయింది. ఓఆర్​ఆర్​ లోపల ఉన్న 27 మున్సిపాలిటీల విలీనానికి ఇటీవల మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనికి గవర్నర్​ కూడా ఓకే చెప్పారు. దీంతో విలీనం మంగళవారం నుంచి అమలులోకి వచ్చినట్లు తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ORR చుట్టూ ఉన్న 27 మునిసిపాలిటీలను GHMC అధికారికంగా తన ఆధీనంలోకి తీసుకుంది. డిప్యూటీ కమిషనర్లు ఇప్పుడు అన్ని రికార్డులు, ఆస్తులు, సిబ్బంది వివరాలు, పన్నులు, పనులు, అనుమతులను GHMCలో విలీనం చేసే బాధ్యతను కలిగి ఉన్నారు. అన్ని ULB బ్యాంకు ఖాతాలు GHMC జనరల్ ఫండ్‌కు మారుతాయి.

కాగా గ్రేటర్​లో పెద్ద అంబర్‌పేట్‌, జల్‌పల్లి, తుర్కయంజాల్‌, మణికొండ, శంషాబాద్‌, నార్సింగి, ఆదిభట్ల, నాగారం, దమ్మాయిగూడ, మేడ్చల్‌, పోచారం, తూంకుంట, ఘట్‌కేసర్‌, గుండ్లపోచంపల్లి, బొల్లారం, తెల్లాపూర్‌, కొంపల్లి, దుండిగల్‌, బడంగ్‌పేట్‌, బండ్లగూడ జాగీర్‌, అమీన్‌పూర్‌, మీర్‌పేట, నిజాంపేట్‌, ఫిర్జాదిగూడ, బోడుప్పల్‌, జవహర్‌నగర్‌ మున్సిపాలిటీలు విలీనం అయ్యాయి.

Must Read
Related News