HomeసినిమాActress Mehreen | మెహ్రీన్‌కి కోపమొచ్చింది.. వారికి గట్టిగా బుద్ది చెప్పిందిగా..!

Actress Mehreen | మెహ్రీన్‌కి కోపమొచ్చింది.. వారికి గట్టిగా బుద్ది చెప్పిందిగా..!

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మెహ్రీన్ ఎప్ప‌టిక‌ప్పుడు ఆస‌క్తిక‌ర విష‌యాలు షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమె ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై ఫైర్ అవుతూ ట్వీట్ చేసింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Actress Mehreen | టాలీవుడ్ నటి మెహ్రీన్ పిర్జాదా ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు (Indigo Airlines) చాలా ఆలస్యమవుతూ ప్రయాణికులను ఇబ్బందుల్లో పడేస్తున్న నేపథ్యంలో మెహ్రీన్ త‌న సోష‌ల్ మీడియాలో (Social Media) స్పందించింది.

ఇండిగో నిజమైన పరిస్థితిని దాచిపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆమె విమర్శించారు. విమానాలు గంటల తరబడి ఆలస్యమవుతున్నా.. ఇండిగో యాప్‌లో (Indigo APP) మాత్రం “సమయానికి” అనే ట్యాగ్ కనిపించడంపై మెహ్రీన్ మండిప‌డ్డారు. తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ “ఇండిగో నరకం చూపిస్తోంది. ఇది లోపం కాదు.. నిర్లక్ష్యం. ప్రయాణికులు విమానాశ్రయాల్లో రెండు రోజులు ఇరుక్కుపోయినా, యాప్‌లో ‘సమయానికి’ అని చూపించడం ఎలా సమంజసం? అని ప్రశ్నించింది.

Actress Mehreen | ఇండిగోపై ఆగ్ర‌హావేశాలు..

బోర్డింగ్ సమయంలో రద్దు చేసే విమానాన్ని కూడా సమయానికి ఉందని చూపిస్తారు. ఇది పూర్తిగా తప్పుదారి పట్టించడం” అని ఫైర్ అయ్యారు. డీజీసీఏ అమలు చేసిన కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్‌ (Flight Duty Time Limitations) కారణంగా పైలట్ల‌కు పెరిగిన విశ్రాంతి సమయం, సిబ్బంది కొరత కారణంగా ఇండిగో విమానాలు భారీగా ఆలస్యమవుతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడగా, విమానయాన రంగ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. మెహ్రీన్ చేసిన ఆరోపణలకు ఇండిగో స్పందిస్తూ.. “మీ సమస్యను మీరు పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీ విమానం ప్రస్తుతం సమయానికి నడుస్తోంది. ఏవైనా మార్పులు ఉంటే వెంటనే తెలియజేస్తాం. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం” అని రిప్లయ్​ ఇచ్చింది.

అయితే ఇండిగో ఈ సమాధానంతో సంతృప్తి చెందని మెహ్రీన్, ప్రయాణికులను దారితప్పించే సమాచారాన్ని నిలిపేయాలని, ఆలస్యాల వలన ఇబ్బందులు పడిన వారికి కంపెనీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక మెహ్రీన్ విష‌యానికి వ‌స్తే ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. ఈ అమ్మ‌డికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఇటీవ‌ల మెహ్రీన్‌కి ఎక్కువ అవ‌కాశాలు రాక‌పోవ‌డం ఆమె అభిమానుల‌ను క‌ల‌వ‌ర‌ప‌రుస్తుంది.

Must Read
Related News