Meesho for public issue | పబ్లిక్‌ ఇష్యూకు మీషో.. డిసెంబర్‌ 3 నుంచి సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం

అక్షరటుడే, న్యూఢిల్లీ: Meesho for public issue | బెంగళూరు(Bengalore) కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ ఇ -కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన మీషో(Meesho)ను 2015లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఎక్కువగా టైర్‌-2, టైం-3 నగరాలపై దృష్టి సారించింది. ఇది మల్టీ సైడెడ్‌ టెక్‌ ప్లాట్‌ఫాం(Multi-sided tech platform)గా ఉంది. కస్టమర్లు, సెల్లర్లు, లాజిస్టిక్స్‌ పార్ట్‌నర్లు, కంటెంట్‌ క్రియేటర్లతో కలిసి ఆన్‌లైన్‌ షాపింగ్‌(Online shopping) నిర్వహిస్తోంది. చౌక ధరలు, విభిన్న రకాల ప్రొడక్ట్స్‌ దీని ప్రత్యేకతలుగా ఉన్నాయి. […]

అక్షరటుడే, న్యూఢిల్లీ: Meesho for public issue | బెంగళూరు(Bengalore) కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ ఇ -కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన మీషో(Meesho)ను 2015లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఎక్కువగా టైర్‌-2, టైం-3 నగరాలపై దృష్టి సారించింది.

ఇది మల్టీ సైడెడ్‌ టెక్‌ ప్లాట్‌ఫాం(Multi-sided tech platform)గా ఉంది. కస్టమర్లు, సెల్లర్లు, లాజిస్టిక్స్‌ పార్ట్‌నర్లు, కంటెంట్‌ క్రియేటర్లతో కలిసి ఆన్‌లైన్‌ షాపింగ్‌(Online shopping) నిర్వహిస్తోంది. చౌక ధరలు, విభిన్న రకాల ప్రొడక్ట్స్‌ దీని ప్రత్యేకతలుగా ఉన్నాయి.

ఈ కంపెనీ వాల్మో లాజిస్టిక్స్‌తో కలిసి దూసుకుపోతోంది. మీషోకు ప్రస్తుతతం 21 కోట్ల యూజర్లున్నారు. ఒక సంవత్సరంలో 200 కోట్ల ఆర్డర్లు ప్రాసెస్‌ చేసినట్లు కంపెనీ పేర్కొంటోంది. ఈ కంపెనీ ఐపీవో(IPO) ద్వారా రూ. 5,421 కోట్లు సమీకరించనుంది.

ఇందులో కొత్త షేర్ల జారీ ద్వారా రూ. 4,520 కోట్లు సమీకరించాలన్నది లక్ష్యం. ఆఫర్‌ ఫర్‌ సేల్‌(OFS)లో 10.55 కోట్ల షేర్లను విక్రయించనుంది.

ఇందులో ఎలివేషన్‌ క్యాపిటల్‌ వీ 5.54 కోట్ల షేర్లు, వై కాంబినేటర్‌ 1.26 కోట్ల షేర్లు, పీక్‌ ఎక్స్‌వీ పార్ట్‌నర్స్‌ 3.05 కోట్ల షేర్లు, వెంచర్స్‌ హైవే 1.57 కోట్ల షేర్లు, కంపెనీ సహ వ్యవస్థాపకులు విదిత్‌ ఆత్రే, సంజీవ్‌ బార్న్‌వాల్‌ కలిసి 0.32 కోట్ల షేర్లు (0.2% కంటే తక్కువ) అమ్ముతున్నారు.

ఐపీవో ద్వారా వచ్చే ఆదాయంలో రూ. 1,390 కోట్లు క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కోసం, రూ. 480 కోట్లు ఏఐ, మెషిన్‌ లర్నింగ్‌ టీమ్‌ వేతనాల కోసం, రూ. 1,020 కోట్లు మార్కెటింగ్‌, బ్రాండ్‌ ప్రమోషన్‌ కోసం, మిగతా నిధులను కొనుగోళ్లు, ఇతర గ్రోత్‌ ప్లాన్ల(Growth plan) కోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.

Meesho for public issue | ఆర్థిక పనితీరు..

మీషో నష్టాల్లో కొనసాగుతోంది. గత ఆర్థిక సంవత్సరం (2024- 25)లో కంపెనీ నష్టం(Loss) రూ. 3,941 కోట్లుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్‌ వరకు 6 నెలల్లో రూ. 701 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. కాగా 2024, 2025 ఆర్థిక సంవత్సరాల్లో క్యాష్‌ ఫ్లో పాజిటివ్‌గా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ(Revenue) 23 శాతం వరకు పెరిగింది.

Meesho for public issue | ప్రైస్‌ బ్యాండ్‌..

కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 105 నుంచి రూ. 111 గా నిర్ణయించింది. గరిష్ట ప్రైస్‌ బ్యాండ్‌(Price band) వద్ద కంపెనీ విలువ రూ. 50,096 కోట్లు అవుతుంది. ఒక లాట్‌(Lot)లో 135 షేర్లున్నాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు గరిష్ట ప్రైస్‌ బ్యాండ్‌ వద్ద ఒక లాట్‌ కోసం కనీసం రూ. 14,985తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Meesho for public issue | కోటా, జీఎంపీ..

ఐపీవో షేర్లలో క్యూఐబీ(QIB)లకు 75 శాతం, నాన్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు 15 శాతం, రిటైల్‌ ఇన్వెస్టర్లకు 10 శాతం కోటా కేటాయించారు. కంపెనీ షేర్లకు గ్రేమార్కెట్‌లో డిమాండ్‌ ఉంది. శనివారం ఒక్కో ఈక్విటీ షేరుపై జీఎంపీ(GMP) రూ. 36గా ఉంది. అంటే లిస్టింగ్‌ సమయంలో 31 శాతానికిపైగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు..

మీషో ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌(Subscription) డిసెంబర్‌ 3న ప్రారంభమవుతుంది. డిసెంబర్‌ 5న ముగుస్తుంది. 8న రాత్రి షేర్ల అలాట్‌మెంట్‌ స్టేటస్‌ వెల్లడయ్యే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు 10న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...