అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Meenakshi Chowdary | టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో (Social Media) హాట్ టాపిక్‌గా మారాయి. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి ఆమె నటించిన తాజా గ్రామీణ నేపథ్య కుటుంబ కథా చిత్రం ‘అనగనగా ఒక రాజు’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఒక ఈవెంట్‌లో మీనాక్షి సరదాగా మాట్లాడిన మాటలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ సందర్భంగా యాంకర్ వేసిన ప్రశ్నకు స్పందించిన మీనాక్షి, తన జీవిత భాగస్వామి గురించి కొంచెం వినూత్నంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. తనకు సినిమాలంటే ఇష్టం కాబట్టి సినిమాలపై ఆసక్తి ఉన్న వ్యక్తి అయితే బాగుంటుందని చెప్పారు.
Meenakshi Chowdary | ఇన్నీ కండీషన్సా..!
అలాగే నటుడు, డాక్టర్ లేదా అందాల పోటీల్లో పాల్గొన్న వ్యక్తి కాకూడదంటూ చమత్కారంగా వ్యాఖ్యానించారు. వ్యవసాయం అంటే ఇష్టమని, పల్లెటూరి వాతావరణం తనకు నచ్చుతుందని చెప్పడం విశేషం. ఇంకా తనకు పొడవుగా ఉండే వ్యక్తులు నచ్చుతారని, లుక్స్ కంటే స్వభావమే ముఖ్యమని స్పష్టం చేశారు. వంట చేయడం, ఇంటి పనుల్లో సహాయం చేయడం వంటి అంశాలపై కూడా సరదాగా మాట్లాడారు. తాను జాయింట్ ఫ్యామిలీ (Joint Family) కాన్సెప్ట్‌ను ఇష్టపడతానని చెప్పడంతో ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ వ్యాఖ్యలన్నీ హాస్యభరితంగా ఉండడంతో ఈవెంట్ వేదిక నవ్వులతో మార్మోగింది. దీనిపై నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) కూడా సరదాగా స్పందిస్తూ, ఇన్ని లక్షణాలు ఉన్న వ్యక్తిని టెక్నాలజీతోనే సృష్టించాల్సి వస్తుందని జోక్ చేశారు.
ఇదిలా ఉంటే, ‘అనగనగా ఒక రాజు’ సినిమా పల్లెటూరి నేపథ్యంతో రూపొందిన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించగా, రావు రమేష్, చమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మారి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మించారు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.